Begin typing your search above and press return to search.
నాకు మంత్రి పదవి ఇస్తే..వాళ్లందరినీ లేపేస్తా
By: Tupaki Desk | 4 Jan 2019 4:46 PM GMTసంచలన వ్యాఖ్యలకు సుపరిచితమైన ఉత్తర్ ప్రదేశ్ నుంచి మరోమారు అదే తరహా కామెంట్ తెరమీదకు వచ్చింది. కలకలం రేగే కామెంట్లకు పెట్టింది పేరయిన భారతీయ జనతా పార్టీ యూపీ నేతల్లో మరో వ్యక్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సైనీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో మూకహత్యలు ఎక్కువయ్యాయని - పోలీసు అధికారుల ప్రాణాల కంటే గోవుల రక్షణే ఎక్కువైందని బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్యే తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. భారత్ లో భద్రత లేదని భావిస్తున్న వారందరినీ బాంబులతో లేపేయాలన్నారు.
ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ లో ఆవును చంపారన్న ఆరోపణలపై బజరంగ్ దళ్ కార్యకర్తలు సృష్టించిన హింసాకాండలో ఓ పోలీసు అధికారి చనిపోయిన ఉదంతం గురించి నసీరుద్దీన్ షా మాట్లాడుతూ ‘ ఓ పోలీసు అధికారి చావుకన్నా ఆవు చావు చాలా ప్రాముఖ్యమైనది’ అని వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే షైనీ స్పందిస్తూ భారత్ లో రక్షణ లేదని అంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ఒక చట్టం రూపొందించాలని కూడా డిమాండ్ చేశారు. ``నా వ్యక్తిగత అభిప్రాయం మేరకు భారత్ లో భద్రత లేదని - బెదిరింపులకు లోనవుతున్నట్లు భావిస్తోన్న వారిని బాంబులతో పేల్చేయాలి. నాకు మంత్రి పదవి ఇవ్వండి.. ఒక్కరు కూడా మిగలకుండా అలాంటి వాళ్లందరినీ లేపేస్తా`` అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.