Begin typing your search above and press return to search.

తాజ్ హోటల్ కు బాంబు బెదిరింపు...

By:  Tupaki Desk   |   30 Jun 2020 10:00 AM GMT
తాజ్ హోటల్ కు బాంబు బెదిరింపు...
X
ముంబై పోలీసులు మంగళవారం ఉదయం నుండి తాజ్ హోటల్ బయట ఎన్నడూ లేని విధంగా విపరీతమైన భద్రతా ఏర్పాట్లను చేయడం జరిగింది. అందుకు కారణం కరాచీ నుండి లష్కరే-ఇ-తోయిబా వారు ముంబై లోని తాజ్ హోటల్ ను బాంబుల తో పేల్చేస్తామని ఒక బెదిరింపు ఫోన్ కాల్ చేయడమే. సోమవారం అర్థరాత్రి 12 గంటల ప్రాంతం లో ఈ ఫోన్ కాల్ వచ్చినట్లు తెలిసింది.

అవతలి నుండి ఒక వ్యక్తి ఫోన్ లో మాట్లాడుతూ “ఈ రోజు పాకిస్థాన్ లోని కరాచీ స్టాక్ ఎక్స్చేంజ్ లో జరిగిన ఉగ్ర వాదుల అటాక్ ని చూశారు కదా. ఈసారి మరలా ముంబై లోని తాజ్ హోటల్ లో 26/11 అటాక్ పునరావృతం అవుతుంది” అని చెప్పినట్లు సమాచారం. ఇక రెండవ బెదిరింపు కాల్ కూడా తాజ్ హోటల్ వారికే చెందిన బాంద్రా లోని మరొక తాజ్ ల్యాండ్ హోటల్ స్టాఫ్ కు వచ్చిందట. ఈ రెండవ బెదిరింపు ఫోన్ కాల్ కూడా పాకిస్తాన్ నుండి వచ్చినట్లు సమాచారం.

దీనితో పోలీసులు ఆ రెండు హోటల్స్ లో ఉన్న స్టాఫ్ వద్ద స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత భారీ స్థాయి లో భద్రత బలగాలను రెండు హోటళ్ళ చుట్టూ మోహరించారు. మనం ఒకసారి నవంబర్ 26, 2008 లో తాజ్ హోటల్ లో జరిగిన అమానుషాన్ని గుర్తు తెచ్చుకున్నట్లయితే పాకిస్తాన్ నుండి బాగా శిక్షణ తీసుకున్న 10 మంది టెర్రరిస్టులు 166 మందిని చంపగా 300 మంది గాయాలపాలయ్యారు. దాదాపు 60 గంటలపాటు ఈ దాడి జరగడం గమనార్హం. ఇక ఉగ్రవాదులందరినీ భారత పోలీసులు మట్టుబెట్టగా కసబ్ అనే ఉగ్రవాదిని మాత్రం ప్రాణాలతో పట్టుకున్నారు. అతనిని 2012లో ఉరి తీయడం జరిగింది.