Begin typing your search above and press return to search.

బ్రేకింగ్: తాజ్ మహల్ కి బాంబ్ బెదిరింపు ... మూసివేత !

By:  Tupaki Desk   |   4 March 2021 6:59 AM GMT
బ్రేకింగ్: తాజ్ మహల్ కి బాంబ్ బెదిరింపు ... మూసివేత  !
X
ప్రేమసౌధం తాజ్‌ మహల్‌ కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు వచ్చింది. దీనితో వెంటనే అప్రమత్తమైన పోలీస్‌ అధికారులు వెంటనే తాజ్‌ మహల్‌ ను మూసివేసి సెర్చ్‌ ఆపరేషన్‌ ప్రారంభించారు. బాంబు బెదిరింపు నేపథ్యంలో తాజ్‌ మహల్‌ను వీక్షించేందుకు వచ్చిన వారిని బయటకు పంపేశారు. బాంబ్‌ స్క్వాడ్స్‌, డాగ్‌ స్క్వాడ్స్‌తో పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. గురువారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి యూపీ పోలీస్ ఎమర్జెన్సీ నెంబర్ 112కి కాల్ చేశాడు.

తాజ్‌మహల్ లోపల బాంబులు పెట్టామని..కాసేపట్లో పేల్చేస్తామని చెప్పారు. ఆ ఫోన్ రాగానే పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే పర్యాటకులను బయటకు తరలించి,తాజ్‌ మహల్ మొత్తాన్ని తనిఖీ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ పోలీసులు, సీఐఎస్ ఎఫ్ ‌తో పాటు బాంబు స్క్వాడ్ సిబ్బంది తాజ్ మహల్ లోపల తనిఖీలు చేపట్టారు. ప్రతి చోటును చెక్ చేస్తున్నారు. ఇప్పటి వరకైతే తాజ్‌మహల్ లోపల ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని ఆగ్రా జోన్ ఏడీజీ రాజీవ్ కృష్ణ ధృవీకరించారు. యూపీలోని ఫిరోజాబాద్ నుంచి కాల్ వచ్చినట్లు ప్రాథమికంగా గుర్తించారు. కాల్ చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫోన్ చేసిన వ్యక్తిని పట్టుబడితేనే దీనికి సంబంధించి మరింత కీలక సమాచారం తెలిసే అవకాశముంది. చారిత్రక కట్టడమైన తాజ్ మహల్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందిన సంగతి అందరికి తెలిసిందే.