Begin typing your search above and press return to search.

అమెరికా ఉపాధ్యక్షురాలు భర్తకు బాంబు బెదిరింపు.. తరలింపు

By:  Tupaki Desk   |   10 Feb 2022 7:37 AM GMT
అమెరికా ఉపాధ్యక్షురాలు భర్తకు బాంబు బెదిరింపు.. తరలింపు
X
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ భర్త డగ్లస్ ఎమ్హాఫ్ పాల్గొన్న చారిత్రక ఈవెంట్ లో బాంబు కలకలం చెలరేగడంతో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఆయనను సురక్షిత ప్రాంతానికి తరలించారు. అమెరికాలో దేశాధినేతల కుటుంబాలకు సంబంధించి అసాధారణ ఘటన చోటుచేసుకుంది. అది కూడా నల్లజాతీయుల చారిత్రక ఈవెంట్ లో జరుగుతున్న సమయంలో వరుస సంఘటనలు కలకలం రేపాయి.

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ భర్త డగ్లస్ ఎమ్హాఫ్ పాల్గొన్న కార్యక్రమంలో బాంబు కలకలం చెలరేగడంతో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఆయనను సురక్షిత ప్రాంతానికి తరలించారు. బాంబు బెదిరింపుతో వైస్ ప్రెసిడెంట్ భర్తను తరలించారనే వార్త సంచలనంగా మారింది.

అమెరికా వైస్ ప్రెసిడెంట్ భర్త డగ్లస్ సెకండ్ జెంటిల్మిన్ హోదాలో భద్రత పొందుతున్నారు. మంగళవారం వాషింగ్టన్ లోని డన్ బార్ హైస్కూల్లో జరిగిన ఈ వెంట్ కు హాజరయ్యారు.

నల్లజాతీయుల పోరాట చరిత్రను మననం చేసుకునే ‘బ్లాక్ హిస్టరీ’ ఈవెంట్ అది. వందలమంది విద్యార్థులను ఉద్దేశించి డగ్లస్ ప్రసంగించబోతుండగా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు హుటాహుటిన అక్కడికి వచ్చి ఆయనను తీసుకెళ్లారు. వెంటనే స్థానిక పోలీసులు విద్యార్థులను సైతం ఖాళీ చేయించారు.

నల్లజాతీయుల కోసం నెలకొల్పిన మొదటి పాఠశాల ‘డన్ బార్’ స్కూల్. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 1 వరకూ బ్లాక్ హిస్టరీ ఈవెంట్స్ ను నిర్వహిస్తుంటారు. స్వతహాగా నల్లజాతీయురాలైన కమలా హ్యారీస్ గతంలో పలు మార్లు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

బాంబు బెదిరింపు తర్వాత బిల్డింగ్ ను ఖాళీ చేయించిన అధికారులు తనిఖీ చేపట్టగా పేలుడు పదార్థాలేవీ లభించలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బ్లాక్ హిస్టరీ ఈవెంట్లకు వరుసగా బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. దీనివల్లే చాలా వేడుకలు రద్దు అయ్యాయి.