Begin typing your search above and press return to search.

బ‌డా బాబుల‌కు షాక్ ఇచ్చిన జ‌డ్జీ

By:  Tupaki Desk   |   21 Aug 2016 6:40 AM GMT
బ‌డా బాబుల‌కు షాక్ ఇచ్చిన జ‌డ్జీ
X
సంప‌న్నులు త‌మ గారాల పిల్ల‌ల విష‌యంలో జాగ్ర‌త్త వ‌హించ‌క‌పోతే ఎలా ఉంటుందో ఈ తీర్పే ఉదాహ‌ర‌ణ‌. త‌మ‌కు అనుగుణంగా నిర్ణ‌యం ఉండాల‌ని కోరుకున్న‌ప్ప‌టికీ కోర్టులు మాత్రం వదిలిపెట్ట‌కుండా ఫైన్ విధించ‌డం ముంబైలో ఆస‌క్తిక‌రంగా మారింది. లైసెన్స్ లేకుండా కారు నడిపి ప్రమాదానికి కారణమైన బాలుడి తండ్రికి బాంబే హైకోర్టు రూ.50 వేల జరిమానా విధించింది. త‌ద్వారా చ‌ట్టం క‌ఠినంగా ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది.

ముంబైకి చెందిన ఒక బాలుడు తన స్నేహితుడిని తీసుకుని కారులో వెళుతూ అంధేరి వెర్సోవా శివారులోని లోఖండ్‌ వాలా వద్ద రోడ్డు డివైడర్‌ ను ఢీకొన్నాడు. దాంతో కారు వెనుక సీటులో కూర్చున్న అతని మిత్రుడు తీవ్రంగా గాయపడి దవాఖాన పాలయ్యాడు. గత ఏడాది సవంబర్‌లో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. అయితే ఆ పిల్లలిద్దరి తల్లిదండ్రులు రాజీపడి ఈ కేసు కొట్టేయాలని హైకోర్టును అభ్యర్థించారు. ఇరువర్గాలు రాజీపడినందువల్ల సాధారణంగా ఇలాంటి కేసును కొద్దిగా జరిమానా విధించి కొట్టేయడం అనేది సాధార‌ణంగా జ‌రుగుతుంది. కానీ ఈ కేసులో ఇతర కీలక అంశాల వల్ల ఆ పని చేయలేకపోతున్నామని జస్టిస్ నరేశ్ పాటిల్ నాయకత్వంలోని ధర్మాసనం పేర్కొన్నది. పిటిషనర్లలో ఒకరైన వాహన యజమాని - మైనర్ అయిన తన కుమారుడికి లెసెన్స్ లేకుండా బండి ఇవ్వడం వల్ల ప్రమాదం జరిగి మరో బాలుడు గాయపడ్డాడనే పేర్కొంటూ సమాజానికి సందేశం ఇవ్వడానికి వాహన యజమానిని శిక్షించాలన్న ప్రాసిక్యూషన్ వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. వాహన యజమానికి జరిమానా విధిస్తూ తుది తీర్పు ఇచ్చింది.