Begin typing your search above and press return to search.
మ్యాగీని ఇతర దేశాలకు ఎగుమతి చేసుకోవచ్చంట
By: Tupaki Desk | 30 Jun 2015 8:28 AM GMTరెండు నిమిషాల ఫాస్ట్‌ఫుడ్ మ్యాగీపై కష్టాల వరద ఒక్కసారి ఉప్పెనలా విరుచుకుపడటం తెలిసిందే. మ్యాగీ న్యూడిల్స్‌లో సీసం.. లెడ్‌తో పాటు ఎంఎస్‌జీ (మోనో సోడియం గ్లూటామేట్)లు పరిమితి మించి ఉన్నాయన్న ఆరోపణలతో పాటు.. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నిర్వహించిన పరీక్షలతో తేలటంతో మ్యాగీ మీద దేశవ్యాప్తంగా నిషేధం విధించటం తెలిసిందే.
దీంతో.. మ్యాగీ ఉత్పత్తులన్నింటినీ ధ్వంసం చేయాలంటూ డిమాండ్లు వెల్లువెత్తటంతో మ్యాగీ తయారీదారు నెస్లూ కోర్టును ఆశ్రయించింది. నెస్లే దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ జరిపిన ముంబయి హైకోర్టు తాజాగా ఒక నిర్ణయాన్ని వెలువరించింది.
భారత్‌లో నిషేధించిన మ్యాగీని.. ఇతర దేశాలకు సరఫరా చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో.. భారత్‌లో ఉన్న స్టాక్‌ను ఇతర దేశాలకు తరలించే అవకాశం నెస్లేకు దక్కుతుంది. గత కొద్దిరోజులుగా దెబ్బ మీద దెబ్బ పడుతున్న నెస్లేకు తాజాగా ముంబయి హైకోర్టు ఇచ్చిన తీర్పు కొంత ఊరట ఇవ్వటం ఖాయం.