Begin typing your search above and press return to search.

అలా సెక్స్ చేయడం చీటింగ్ కాదంటోన్న కోర్టు

By:  Tupaki Desk   |   25 Dec 2021 12:30 AM GMT
అలా సెక్స్ చేయడం చీటింగ్ కాదంటోన్న కోర్టు
X
రేప్...గతంలో ఈ పదానికి ఉన్న అర్థం...కాలగమనంలో మారిపోయిందని చెప్పవచ్చు. గతంలో బలవంతంగా ఇష్టం లేకుండా మహిళతో శృంగారం చేస్తే రేప్ గా పరిగణించేవారు. ఇక, ఈ హైటెక్ యుగంలో అయితే, పరస్పర అంగీకారంతో కొన్నాళ్లపాటు శారీరక సంబంధం పెట్టుకొని...ఆ తర్వాత ఇద్దరికీ చెడడంతో కొందరు మహిళలు రేప్ కేసులు పెడుతున్న ఘటనలు చర్చనీయాంశమయ్యాయి.

ఇక, కొందరు మగాళ్లయితే...పెళ్లి చేసుకుంటామని మాయమాటలు చెప్పి మహిళలను శారీరకంగా వాడుకొని వదిలేసిన ఘటనలూ ఉన్నాయి. ఈ సందర్భంలో కచ్చితంగా మగాళ్లదే తప్పు అని, వారిపై కొందరు మహిళలు రేప్ కేసులు పెడుతున్నారు. అయితే, పెళ్లి చేసుకుంటానని చెప్పకుండా ఇద్దరూ ఇష్టపూర్వకంగా సెక్స్ లో పాల్గొంటే, ఆ తర్వాత పెళ్లికి నిరాకరిస్తే తప్పా? కాదా అన్న చర్చ చాలాకాలంగా నడుస్తోంది.

ఈ క్రమంలోనే ఇటువంటి ఓ కేసుపై బాంబే హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. పరస్పర అంగీకారంతో సెక్స్ చేసుకొని, ఆ తర్వాత పెళ్లికి నిరాకరించడం మోసం చేసినట్టు కాదని ఓ కేసు విచారణలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ తరహా కేసులో 25 ఏళ్ల తర్వాత ఓ వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించింది. నిజానికి పెళ్లికి నిరాకరించడం సెక్షన్ 417 కింద నేరం కాదని పేర్కొంది.

మహారాష్ట్రలోని పాల్గఢ్‌కు చెందిన వ్యక్తి ఓ మహిళతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఆమెకూడా ఇష్టపూర్వకంగానే ఆ సంబంధం నెరిపింది. అయితే, ఆపై పెళ్లి చేసుకునేందుకు అతడు నిరాకరించాడంటూ అతడిపై కేసు పెట్టింది. దీంతో, అతడికి ఏడాది జైలు శిక్ష, రూ. 5 వేల జరిమానా గతంలో విధించారు. కానీ, ఈ తీర్పును నిందితుడు బాంబే హైకోర్టులో సవాలు చేశాడు. తాజాగా ఈ కేసు విచారణ జరిపిన న్యాయస్థానం నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది. పరస్పర అంగీకారంతోనే వారు శారీరక సంబంధం పెట్టుకున్నట్టు సాక్ష్యాధారాలు ఉన్నాయని పేర్కొంది. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసినట్లు ఆధారాలు లేవని తెలిపింది.