Begin typing your search above and press return to search.

అబూసలేం పెళ్లి ముచ్చట.. షాకిచ్చిన కోర్టు

By:  Tupaki Desk   |   7 Aug 2018 12:36 PM GMT
అబూసలేం పెళ్లి ముచ్చట.. షాకిచ్చిన కోర్టు
X
ముంబై మాఫియా గ్యాంగ్ స్టర్ అబూసలేంకు కోర్టు షాకిచ్చింది. తన స్నేహితురాలిని పెళ్లి చేసుకోవడానికి పెరోల్ కోసం పెట్టుకున్న అభ్యర్థనను ముంబై హైకోర్టు తిరస్కరించింది.జైళ్ల చట్టాల ప్రకారం ఇది కుదరదని పేర్కొంది. ఉగ్రవాద కార్యకలాపాల కింద అరెస్ట్ అయ్యి జైల్లో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తులకు పెరోల్ ఇవ్వడం కుదరదని కోర్టు స్పష్టం చేసింది.

కాగా అబూసలేం లాయర్ల వాదన మాత్రం ఆసక్తికరంగా సాగింది. అబూసలేం కొన్ని సంవత్సరాలుగా జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడని.. పెళ్లి చేసుకుంటానని ఓ మహిళకు ప్రమాణం చేశాడని.. అందుకోసం అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. శిక్ష అనుభవిస్తున్న వారికి కూడా కుటుంబ జీవితాన్ని గడిపే హక్కు, సామాజిక సంబంధాలు నెరిపే హక్కు ఉంటుందని వాదనలు వినిపించారు. వివిధ కేసుల్లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను ప్రస్తావించారు. కానీ ముంబై హైకోర్టు ఈ కరుడుగట్టిన ఉగ్రవాదికి పెరోల్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు.

పోర్చుగల్ దేశం 2005లో ఉగ్రవాది అబూంసలేంను భారత్ కు అప్పగించింది. అప్పటి నుంచి ముంబైలోని జైల్లోనే ఉంటున్నాడు. 1993 లో ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో సలేం దోషిగా తేలాడు.. ఆ ఘటనలో 257మంది ప్రాణాలు కోల్పోగా.. 713మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రస్తుతం ఈ కేసులోనే యావజ్జీవ కారాగార శిక్షను అనుభవిస్తున్నాడు.