Begin typing your search above and press return to search.
మహిళ శరీరంలో ఏ పార్ట్ తాకినా నేరమే: బాంబే హైకోర్టు సంచలనం
By: Tupaki Desk | 29 Dec 2021 12:30 PM GMTదేశంలో మానభంగాలు పెరిగిపోతున్నాయి. స్త్రీలపై అఘాయిత్యాలు, అవమానాలు, లైంగిక వేధింపులకు కొదవే లేదు. చాలా మంది మౌనంగా భరిస్తుంటే మరికొందరు ధైర్యంగా వాటిని ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే అసలు మహిళలు తాకినా నేరమా? కాదా? అన్న సంశయం వెంటాడుతుండేది. తాజాగా దానిపై క్లారిటీ వచ్చేసింది.
మహిళ అనుమతి లేకుండా ఆమె పాదాలనే కాదు.. శరీరంలోని ఓ భాగాన్ని తాకినా.. ఆమె ప్రతిష్టకు, గౌరవానికి భంగం కలిగించడమేనని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు నిందితుడిని దోషిగా పరిగణిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.
తాను మహిళ పాదాలను మాత్రమే తాకానని పేర్కొంటూ కింది కోర్టు విధించిన శిక్షను రద్దు చేయాలని నిందితుడు బాంబే హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారణ చేపట్టిన ఔరంగాబాద్ ధర్మాసనం న్యాయమూర్తి జస్టిస్ ఎంజీ సెవ్లికర్.. పిటీషన్ ను తోసిపుచ్చింది..
మహారాష్ట్రలోని జాల్నా జిల్లా పర్టూర్ పట్టణానికి చెందిన మహిళ.. పక్కింట్లో ఉండే నిందితుడు తన భర్త లేని సమయంలో అర్థరాత్రి వేళ ఇంటికొచ్చి పాదాలను తాకాడని 2014 జులైలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పక్కంటి వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు నిందితుడిని దోషిగా తేల్చింది. అర్ధరాత్రి బాధితురాలి ఇంటిలోకి ప్రవేశించి పాదాలను తాకడం చూస్తుంటే లైంగిక ఉద్దేశంతోనే ఆ పనిచేసినట్లు అర్థమవుతోందని పేర్కొంది. నిందితుడికి ఏడాది పాటు జైలు శిక్ష విధించింది.
మహిళ అనుమతి లేకుండా పాదాలే కాదు.. శరీరంలోని ఏ భాగాన్ని తాకినా గౌరవానికి భంగం కలిగించినట్టేనని అభిప్రాయపడింది. దీనిని నిందితుడు బాంబే హైకోర్టులో సవాల్ చేయగా.. దిగువ కోర్టు తీర్పును సమర్థించింది.