Begin typing your search above and press return to search.
భార్య ఇంటి పనులు చేయాలని చెప్పడం క్రూరత్వం కాదు!
By: Tupaki Desk | 28 Oct 2022 6:31 AM GMTఇంటి పనులు చేయాలని వివాహితకు అత్తింటివారు చెప్పడం ఎంత మాత్రం క్రూరత్వం కాదని బాంబే హైకోర్టు తేల్చిచెప్పింది. ఇది క్రూరత్వం కిందకు రాదని పిటిషనర్‌కు స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు రద్దు చేసింది.
పెళ్లయిన తర్వాత నెల రోజుల వరకు అంతా బాగానే ఉందని, ఆ తర్వాత నుంచి అత్తింటి వారు పనిమనిషిలా చూస్తున్నారని ఓ వివాహిత బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇంటి పనంతా తనతోనే చేయిస్తున్నారని ఆ పిటిషన్‌లో పేర్కొంది. తనను మానసికంగా, శారీరకంగా తనను వేధిస్తున్నారని పిటిషన్‌లో ఆరోపించింది.
దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఒక వివాహితను ఇంటి పని చేయమని చెప్పారంటే..అది కచ్చితంగా కుటుంబ అవసరాలకేనని తెలిపింది. అంతే తప్ప పని మనిషిలా చూస్తున్నారని చెప్పలేమని హాట్ కామెంట్స్ చేసింది. ఇంటి పనులు చేయడం ఇష్టం లేకపోతే..పెళ్లికి ముందే ఈ విషయం గురించి మాట్లాడుకోవాల్సిందని తెలిపింది.
పెళ్లికి ముందే ఇంటి పనులు చేయడం ఇష్టం లేదని వధువు చెప్పి ఉంటే అప్పుడు వరుడి కుటుంబ సభ్యులు వివాహం విషయంలో మరోసారి ఆలోచించుకునే వీలుండేదని బాంబే హైకోర్టు చెప్పింది. కాబట్టి పెళ్లికి ముందే ఇలాంటి సమస్యలను పరిష్కరించుకుని ఉంటే బాగుండేదని అభిప్రాయపడింది.
తాజా కేసులో భార్య తన భర్త, అతడి తల్లిదండ్రులపై చేస్తున్న ఆరోపణల్లో ఎంత మాత్రం నిజం లేదని చెబుతూ ఆమె దాఖలు చేసిన కేసును కొట్టివేసింది.
గృహ హింస కేసు విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 498a ప్రకారం వివాహం అయిన మహిళ అత్తారింటిలో పనులు చేయించటం క్రూరత్వం కాదని కోర్టు తెలిపింది. ఒక వివాహిత స్త్రీని కుటుంబ ప్రయోజనాల కోసం ఇంటి పని చేయమని అడిగితే..ఆమెను కుటుంబ సభ్యులు పనిమనిషిగా చూస్తున్నట్లుగా చెప్పలేమని పేర్కొంది. పైగా అత్తామామలు శారీరకంగా హింసించినట్టు వివాహిత ఎలాంటి ఆధారాలు చూపలేదని కోర్టు పేర్కొంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.