Begin typing your search above and press return to search.
వ్యభిచారం నేరం కాదు..బాంబే హైకోర్టు సంచలన తీర్పు!
By: Tupaki Desk | 26 Sep 2020 5:30 PM GMTబాంబే హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. వ్యభిచారం క్రిమినల్ నేరం కాదని స్పష్టం చేసింది. అయితే, ఉద్దేశపూర్వకంగా సెక్సు వల్ గా ప్రేరేపించడం, బ్రోతల్ హౌస్ నిర్వహించడం మాత్రం చట్ట వ్యతిరేకం. చట్ట ప్రకారం వ్యభిచారం క్రిమినల్ నేరం కాదన్న హైకోర్టు ఓ మహిళ తాను ఏం చేయాలనుకుంటుందోని ఎంచుకునే హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. రాష్ట్ర హోంలో ఉన్న ముగ్గురు మహిళలను రిలీజ్ చేసింది. ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్, 1956 కింద వ్వభిచారం క్రిమినల్ నేరం కాదని జస్టిస్ పృధ్వీరాజ్ చవాన్ తీర్పులో వెల్లడించారు.
మహారాష్ట్రలోని మజ్‌గావ్ లో ఓ ముగ్గురు మహిళలను వ్యభిచారం నేరం కింద పోలీసులు అరెస్టు చేశారు. వారిని బాధితులుగా పేర్కొన్నారు. వారిని ఏడాది నుంచి ప్రభుత్వ నిర్వహించే హోంలో ఉంచారు. అయితే, ముగ్గురు మహిళల అభీష్టానికి వ్యతిరేకంగా వారిని ఉంచడానికి వీల్లేదని బోంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఆ ముగ్గురు మహిళలను పోలీసులు బాధితులుగా పేర్కొన్నారు. చట్టం ప్రకారం వారిని మూడు వారాలకు మించి హోంలో ఉంచడానికి వీల్లేదు. ఆ ముగ్గురు మహిళలు పెద్దవారని, వారు ఎక్కడ ఉండాలో, ఏం చేయాలో నిర్ణయించుకునే ప్రాథమిక హక్కు వారికి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. సదరు యువతులు, వ్యభిచార వృత్తిని జీవనోపాధిగా మలచుకున్న సామాజిక వర్గానికి చెందిన వారన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిందని జస్టిస్ చవాన్ తెలిపారు.
ఆ ముగ్గురు మహిళలను వ్యభిచారం నేరం కింద అరెస్టు చేయలేదని, బాధితులుగా పొందుపరిచారు కాబట్టి, సదరు చట్టం కింద వారిని ఎక్కువకాలం రాష్ట్ర ప్రభుత్వం హోంలో ఉంచడానికి వీల్లేదని కోర్టు చెప్పింది. అదే సమయంలో సదరు మహిళలు వ్యభిచారం చేసే ఉద్దేశంతో వ్యక్తులను సెక్యువల్ గా ప్రేరేపిస్తున్నారని పిటిషనర్ ఎక్కడా పేర్కొనలేదని కోర్టు అభిప్రాయపడింది. అయితే, ఆర్థికంగా లబ్ధిపొందేందుకు సెక్సువల్ గా ప్రేరేపించడం, ఓ వ్యక్తిని శృంగారానికి ప్రేరేపించడం నేరమని స్పష్టం చేసింది.