Begin typing your search above and press return to search.
మోకిన్ ఇండియా తొలిరోజు కలెక్షన్ ఎంతంటే..?
By: Tupaki Desk | 14 Feb 2016 6:45 AM GMTదేశ ఆర్థిక రాజధాని అయిన ముంబయిలో స్టార్ట్ అయిన మేకిన్ ఇండియా వారోత్సవాల్లో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి భారీగా నేతలు.. పారిశ్రామికవేత్తలు హాజరైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని షురూ చేసిన ప్రధాని మోడీ.. మెకిన్ ఇండియా మీద తన విజన్ ను మరోసారి వెల్లడించటమే కాదు.. తమ సర్కారు హయాంలో చేపట్టిన విధానాల్ని మరోసారి వివరించే ప్రయత్నం చేశారు.
పెట్టుబడుల్ని ఆకర్షించటమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి వచ్చిన స్పందన సంతృప్తికరంగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తొలిరోజు జరిగిన ఒప్పందాల విలువే దీనికి నిదర్శనమని చెబుతున్నారు. తొలిరోజున రూ.21వేల కోట్ల వ్యాపార ఒప్పందాలు జరిగినట్లుగా అధికారులు చెబుతున్నారు. ఫిన్లాండ్.. స్వీడన్ ప్రధానమంత్రులతో పాటు.. పోలాండ్ ఉప ప్రధానితో పాటు 68 దేశాలకు చెందిన ప్రభుత్వ ప్రతినిధి బృందాలు.. 78 దేశాలకు చెందిన వాణిజ్య బృందాలతో పాటు.. దేశంలోని పలువురు పారిశ్రామికవేత్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
2500 అంతర్జాతీయ కంపెనీలు.. 8000 దేశీయ కంపెనీలు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోనున్నాయి. ఈ ప్రోగ్రాం తొలిరోజున రూ.21వేల కోట్ల విలువైన ఒప్పందాలు జరిగాయి. ఈ కార్యక్రమం ముగిసే నాటికి మరిన్ని ఒప్పందాలు జరుగుతాయన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.