Begin typing your search above and press return to search.

అంతా గంటా.. బొండా నోట్లో స్వీట్లు పెట్టేస్తున్నారుగా

By:  Tupaki Desk   |   2 Dec 2017 9:24 AM GMT
అంతా గంటా.. బొండా నోట్లో స్వీట్లు పెట్టేస్తున్నారుగా
X
చంద్ర‌బాబు మొన‌గాడు భ‌య్‌. ఏం చెప్పిండు.. ఏం చెప్పిండు.. కాపుల్ని బీసీల్లో చేరుస్తాన‌న్నాడు.. చేర్చేశాడు. బాబు మాట అంటే మాటే. ఇచ్చిన మాట‌ను తీర్చే వ‌ర‌కూ నిద్ర‌పోడు. కాకుంటే.. నాలుగేళ్లు వెయిట్ చేయాల్సిందే. ఎన్నిక‌ల‌కు ముందు ఎవ‌రూ త‌న‌ను అడ‌గ‌కున్నా తాను పాద‌యాత్ర సంద‌ర్భంగా చూసిన దృశ్యాల్ని మ‌న‌సులో పెట్టుకొని కాపు రిజ‌ర్వేష‌న్ల మీద హామీ ఇచ్చిన‌ట్లుగా చెబుతారు.

ఎందుకీ మాట ఇప్పుడు చెబుతారంటే.. అక్క‌డే ఉంది తిర‌కాసంతా. కాపుల్ని బీసీల్లో చేరుస్తూ.. ఈ రోజు ఏపీ అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లు కేవ‌లం విద్యా.. ఉద్యోగాల‌కు మాత్ర‌మే. కీల‌క‌మైన రాజ‌కీయాల‌కు మాత్రం ఇది వ‌ర్తించ‌దు. ఎందుకిలా? అన్న ప్ర‌శ్న వేరే వాళ్ల అడ‌గ‌క‌ముందే ఆ విష‌యాన్ని చెప్పేశారు చంద్ర‌బాబు. ఎన్నిక‌ల ముందు ఎవ‌రూ త‌న‌ను అడ‌గ‌కున్నా తాను రిజ‌ర్వేషన్లు ఇస్తాన‌ని చెప్పానని.. రాజ‌కీయాల్లో రిజ‌ర్వేష‌న్లు ఇస్తాన‌ని చెప్ప‌లేదు కాబ‌ట్టి.. తానిప్పుడు ఇవ్వ‌ట్లేద‌నేశారు.

ఎక్క‌డైనా.. కాపుల‌కు రిజ‌ర్వేన్లు ఇస్తామ‌న్న మాట చెప్పినంత‌నే.. విద్య‌లోనూ.. ఉపాధిలోనూ.. రాజ‌కీయాల్లోనూ అన్నింట్లో ఇస్తారా? కొన్నింట్లో మాత్ర‌మే ఇస్తారా? అని అడ‌గ‌రు క‌దా. అలా అడ‌గ‌లేదు కాబ‌ట్టి తాను ఇవ్వ‌లేదంటూ బాబు చెప్ప‌టం చూస్తే.. సీఎంగారి తెలివి ఎంత‌న్న‌ది ఇట్టే అర్థ‌మ‌వుతుంది. ఏపీ అసెంబ్లీలో కాపు రిజ‌ర్వేష‌న్ల బిల్లు పెట్టేసి.. త‌న‌కున్న బ‌లంగా పాస్ చేయించ‌ట‌మేకాదు. వెంట‌నే కేకులు.. స్వీట్లు పంచేస్తూ పండ‌గ వాతావ‌ర‌ణాన్ని త‌ల‌పించేలా చేస్తున్నారు.

మంత్రి గంటాకు చంద్రబాబు నోట్లో స్వ‌యాన స్వీటు పెడితే.. చాలామంది తెలుగు త‌మ్ముళ్లు ఎమ్మెల్యే బొండా నోట్లో స్వీటు పెట్టారు. అంతా బాగానే ఉంది కానీ.. డౌట్ ఏమిటంటే.. ఎక్క‌డైనా ల‌బ్ధి పొందినోళ్లు పార్టీ ఇస్తారు కానీ.. రివ‌ర్స్ లో హామీ ఇచ్చి నెర‌వేర్చిన వారే స్వీట్లు నోట్లో పెట్ట‌టం ఏమిటో? ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డ‌ట‌మేకాదు.. నాలుగేళ్ల త‌ర్వాత హామీని నెర‌వేర్చిన చంద్ర‌బాబు నోట్లో స్వీట్లు పెట్ట‌కుండా.. మీరు తిన‌టం ఏమిటి గంటా?

కాపులు కోరుకున్న‌ట్లుగా రిజ‌ర్వేష‌న్లు ఇచ్చిన‌ట్లుగా ఫీల్ అవుతూ.. త‌మ్ముళ్ల స్వీట్ల‌ను తింటున్న బొండా.. తాను అంద‌రికి స్వీట్లు ఇవ్వాలి కానీ.. రివ‌ర్స్ లో స్వీట్లు తిన‌టం ఏమిటి?

ఎవ‌రికి ఎవ‌రు స్వీట్లు పెట్టారు? ఎవ‌రు తింటున్నారు? అన్నవి ప‌క్క‌న పెడితే.. తానిచ్చిన హామీని అమ‌లు చేశాన‌ని చెప్పే చంద్ర‌బాబును మంత్రి గంటా కానీ.. బొండా కానీ ఏమైనా అడిగారా? అన్న‌ది సందేహంగా మారింది. బాబుకేం హామీ తీర్చేసుకున్న‌ట్లు డిక్లేర్ చేసేశారు. అవునంటూ గంటా.. బొండా స్వీట్లు తినేశారు. మ‌రి..కోట్లాదిగా ఉన్న కాపుల‌కు కొన్ని డౌట్లు ఉన్నాయి? వాటిని తీర్చేదెవ‌రు?

ఇంత‌కీ.. డౌట్లు ఏమిటంటే..

1. ఏపీ అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు స‌రే.. రేపొద్దున కేంద్రం ఒప్పుకోక‌పోతే బాబే బాధ్య‌త తీసుకుంటారా?

2. రాజ‌కీయంగా రిజ‌ర్వేష‌న్లు లేకుండా విద్య‌.. ఉద్యోగ‌.. ఆర్థిక అంశాల్లో మాత్ర‌మే రిజ‌ర్వేష‌న్లతో కాపు స‌మాజానికి మేలు జ‌రుగుతుంద‌ని న‌మ్ముతున్నారా?

3. జ‌స్టిస్ మంజునాథ క‌మిష‌న్ కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లను ఇవ్వాలంటూ ఏక‌గ్రీవంగా చెప్పిందా?