Begin typing your search above and press return to search.

వంశీని వదులుకోము..రాజీనామాపై బోండా - కేశినేని రియాక్షన్!

By:  Tupaki Desk   |   28 Oct 2019 12:25 PM GMT
వంశీని వదులుకోము..రాజీనామాపై బోండా - కేశినేని రియాక్షన్!
X
వల్లభనేని వంశీ గత వారం రోజులుగా ఏపీ రాజకీయం మొత్తం ఈయన చుట్టూనే తిరుగుతుంది. గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే అయిన వల్లభనేని వంశీ కేవలం మూడు రోజుల గ్యాప్ లోనే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ని - సీఎం జగన్ మోహన్ రెడ్డిని - బీజేపీ ఎంపీ సుజనా చౌదరిని కలిశారు. దీనితో అసలు ఎమ్మెల్యే వంశీ ఏంచేస్తున్నాడో అర్థం కావడంలేదు.ఈ సమయంలోనే టీడీపీ కి - తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తునట్టు అధినేత చంద్రబాబు కి తెలియజేసారు.

అయితే ఆయన్ను బుజ్జగించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు.. ఎంపీ కేశినేని నాని - మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావులను రంగంలోకి దింపారు. ఎంపీ కేశినేని నాని వంశీ తో భేటీ ఆయన తరువాత మాట్లాడుతూ .. వంశీ చేసిన పోరాటాలు పార్టీ గుర్తుపెట్టుకుంటుందని. వైసీపీ ప్రభుత్వం మోపుతున్న కేసుల గురించి వంశీ బాధపడుతున్నారన్నారు. ఈ మధ్య జగన్‌ను వంశీ కలిసింది ప్రజా సమస్యల కోసమేనని భావిస్తున్నాం అని - పార్టీ నిర్ణయానికి వంశీ ఎప్పుడూ కట్టుబడి ఉన్నారు. వంశీని వదులుకోవడానికి పార్టీ సిద్ధంగా లేదు అని తెలిపాడు.

ఇక వంశీ రాజీనామా వ్యవహారంపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమమహేశ్వరరావు కూడా స్పందించారు. వైసీపీ వర్గీయుల వేధింపులు వల్లే రాజీనామా చేస్తున్నట్లు చెప్పిన వంశీ.. మళ్లీ అదే పార్టీలోకి ఎందుకెళ్తారు అంటూ మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ దాడులను ఎదుర్కునేందుకు తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటూ పోరాటాన్ని కొనసాగిస్తుంద అని - నిజంగా పార్టీ మారాలనుకుంటే సాంప్రదాయ ఫార్మాట్‌ లో రాజీనామా చేసి వెళ్ళిపోవచ్చు. ఈ గందరగోళ పరిస్థితులకు పుల్ స్టాప్ పెట్టి వంశీ ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని నేను భావిస్తున్నాను అంటూ తెలిపారు. ఏదేమైనా వంశీ వ్యవహారం ఇప్పుడు టీడీపీలో చర్చనీయాంశంగా మారింది.