Begin typing your search above and press return to search.
ఉమా ప్రవర్తనతో టీడీపీ ఎన్నారైల షాక్
By: Tupaki Desk | 26 July 2019 11:17 AM GMT2019 ఎన్నికల్లో వైసీపీ చేతుల్లో ఘోర పరాజయానికి గురైన టీడీపీ ఇబ్బందులు పడుతోంది. టీడీపీకి భవిష్యత్ లేదని డిసైడ్ అయిన ఆ పార్టీ నేతలు చాలా మంది ఇతర పార్టీల్లోకి జంప్ చేసేందుకు వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే నలుగురు రాజ్యసభ ఎంపీలు బిజెపిలో చేరినప్పటికీ, మరి కొందరు నాయకులు రాబోయే రోజుల్లో ఇతర పార్టీలలోకి జంప్ చేస్తారని చర్చ నడుస్తోంది.
టిడిపిని విడిచిపెట్టాలనుకునే నాయకులలో టిడిపి మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా పేరు కూడా గట్టిగా వినిపిస్తుంది. తాజాగా ఉమా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఉమా ఆస్ట్రేలియా పర్యటన గురించి తెలుసుకున్న పలువురు ఎన్ ఆర్ ఐ టిడిపి నాయకులు బోండా ఉమాను కలవాలని డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఎన్ ఆర్ ఐ టిడిపి అభిమానులందరితో 'మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రయత్నించారు.
ఈ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమ నిర్వహణకు ఉమా సన్నిహితులలో ఒకరు ప్రణాళిక వేసినా... ఎన్ ఆర్ ఐ టిడిపి నాయకులను కలవడానికి ఉమా ఆసక్తి చూపలేదట. ఉమా యొక్క ప్రవర్తన ఎన్ ఆర్ ఐ టిడిపి నాయకులకు పెద్ద షాక్ ఇచ్చినట్లయ్యింది. ఇటీవల పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు లాంటి వాళ్లు అక్కడకు వెళ్లి ఎన్నారై టీడీపీ నాయకుల కార్యక్రమాల్లో పాల్గొని ఉత్తేజ పరిచారు.
పార్టీ ఓడిపోతే ఉమా పార్టీ అభిమానులను కూడా కలిసేందుకు ఇష్టపడకపోవడం సరికాదని అక్కడ పార్టీ అభిమానులు వాపోతున్నారు. ఉమా కూడా పార్టీ మారే లిస్టులో ఉన్నాడని.. ఆయన అటు వైసీపీతో పాటు ఇటు బీజేపీ నేతలతోనూ టచ్ లో ఉన్నాడని వినికిడి. వైసీపీ కీలక నేతలతో పాటు బీజేపీకి చెందిన ఎంపీ సుజనా చౌదరితో టచ్ లో ఉండడంతో టీడీపీ కార్యక్రమాలపై పెద్ద ఆసక్తితో లేరని గుసగుసలు వినిపిస్తున్నాయి.