Begin typing your search above and press return to search.
ఈ గుండు గీసుకునే సవాలేంది బోండా ఉమా?
By: Tupaki Desk | 21 Aug 2017 5:48 AM GMTనంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో నాయకుల మాటలు ఓట్లను కొల్లగొట్టే దశను దాటి సవాళ్లు విసురుకునే స్థాయికి చేరింది. గెలుపు, ఓటముల గురించి సవాళ్లు చేసుకోవడం సహజం అయినప్పటికీ తాజాగా టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ మాత్రం అంతకు మించి మరో సవాల్ విసిరారు. అది కూడా నంద్యాల ఉప ఎన్నిక బరిలో నిలిచిన వైసీపీ అభ్యర్ధి శిల్పా మోహన్ రెడ్డికో - వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికో కాదు...వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాకు కావడం ఆసక్తికరం. ఇంతకీ బోండా ఉమా విసిరిన సవాల్ ఏంటంటే తమ పార్టీల గెలుపు ఓటముల ఆధారంగా గుండు గీసుకోవడం.
తాజాగా మీడియాతో మాట్లాడిన బోండా ఉమ మైకులున్నాయని రోజా ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అందుకే రోజాకు సవాల్ చేస్తున్నానని పేర్కొంటూ ``నంద్యాలలో టీడీపీ గెలవకపోతే ఇక్కడే గుండు చేయించుకుంటా..వైసీపీ ఓడిపోతే రోజా కూడా గుండు చేయించుకోవాలి- రోజా ఈ చిన్న సవాల్ ని స్వీకరించు`` అంటూ ప్రకటించారు. వైసీపీ అభ్యర్థి శిల్పా సారథ్యంలోని శిల్పా సహకార సంఘాల మీద అనేక ఫిర్యాదులు వచ్చాయని బోండా ఉమా తెలిపారు. కాంగ్రెస్ - టీడీపీలో పదవుల్లో ఉంటు ఇన్నాళ్లు వీటన్నింటిని శిల్పా మోహన్ రెడ్డి కప్పిపెట్టారని ఆరోపించారు. ఈ సంఘాలకు చట్టపరంగా ఎటువంటి అనుమతులు లేవని తెలిపారు. మహిళలకు రుణాలిస్తున్నామని చెప్పి ఆ మహిళల్ని లైంగికంగా కూడా వేధిస్తున్నారని ఆరోపించారు. శిల్పాకు భయపడిన బాధితులంతా వారి సమస్యలను టీడీపీ నేతల దృష్టికి తెచ్చారని బోండా ఉమా తెలిపారు.
శిల్పాసహకార సంస్థల మీద దర్యాప్తు చేయాల్సిందేనని బోండా ఉమ స్పష్టం చేశారు. మహిళలెవరూ రుణాలు తిరిగి కట్టవద్దని కోరుతూ ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని తెలిపారు. చట్టబద్దత లేని సంస్థ కాబట్టే మేం రుణాలు చెల్లించొద్దంటున్నామని వివరించారు ప్రజలు ఫిర్యాదులు చేయకుండా ప్రభుత్వం ఎలా చర్యలు తీసుకుంటుందని మీడియాను ఎదురు ప్రశ్నించారు. ఫిర్యాదులొచ్చాయి కనుకే చర్యలు తీసుకుంటామంటున్నాంమని పేర్కొన్నారు. శిల్పా అనుచరులు ముగ్గురు మహిళల్ని ఒకే రోజు హత్య చేశారని ఆరోపించారు. గతంలో జరిగిన ఈ సంఘటన తాజాగా బయటకు వచ్చిందని పేర్కొంటూ ఇవన్నీ పోలీస్ రికార్ట్స్ లలో లేవన్నారు.