Begin typing your search above and press return to search.
ముద్రగడపై బోండా మొదలెట్టేశాడు
By: Tupaki Desk | 22 Aug 2016 2:15 PM GMTకాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం విడుదల చేసిన బహిరంగ లేఖ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడిని రాజేసింది. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును టార్గెట్ చేసినట్లుగా ఈ లేఖ ఉండటంతో తెలుగుదేశం నాయకులు మండిపడుతున్నారు. ముద్రగడపై విమర్శలు చేయడంలో ముందుండే టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తాజాగా తెరమీదకు వచ్చారు. కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని హామీలిచ్చి అమలుచేయని వైఎస్ రాజశేఖర్ రెడ్డిని దేవుడిగా - మేనిఫెస్టోలో కోటా హామీని పెట్టని వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మిత్రుడిగా భావించడం ఏంటని ప్రశ్నించారు. లోటు బడ్జెట్లో కూడా ఇచ్చిన హామీలను అమలుచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును శత్రువుగా ముద్రగడ పద్మనాభం భావించడం ఆశ్చర్యకరంగా ఉందని బోండా ఉమా మండిపడ్డారు.
ఆస్తులను విధ్వంసం చేయడం - తగులబెట్టడం - గొడవలు రేపి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలనేది వైఎస్ కుటుంబ నీతి అని పేర్కొంటూ... ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ముద్రగడ ఒక ప్రత్యేకమైన అజెండా పెట్టుకొని కోసం పనిచేస్తున్నట్లు స్పష్టమవుతోందని ఆయన్ను కెలికే ప్రయత్నం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిన వారిపై చర్యలు తీసుకోవడం తప్పెలా అవుతుందని బోండా ప్రశ్నించారు. చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కాపు సంక్షేమం కోసం అమలు చేయనటువంటి పథకాలు - కార్యక్రమాలు చేపడుతున్న చంద్రబాబునాయుడును విమర్శించడంలో ఆంతర్యమేమిటని నిలదీశారు. మిగులు బడ్జెట్ ఉండికూడా కాపుల స్థితిగతులపై సర్వే చేయడానికి రూ. 46 లక్షలు ఇవ్వడానికి చేతులురాని తల్లి - పిల్ల కాంగ్రెస్ లు కాపు మిత్రుల అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు ముద్రగడ సమాధానం చెప్పాలని బోండా ఉమా కోరారు.
కాపు యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడంతో పాటు కాపు విద్యార్థులను ప్రోత్సహించేందుకు స్కాలర్ షిప్ లు - విదేశీ విద్య అందించేందుకు ప్రత్యేకసాయం కూడా అందిస్తున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత ముద్రగడకు ఉందా అంటూ బోండా నిప్పులు చెరిగారు. కాపులు సామాజిక సమావేశాలు-కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు 13జిల్లాల్లో కాపు భవన్లు ఏర్పాటుచేయడం, కాపు విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ కాపు నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ - కాపు సంక్షేమ నిధిని రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా ఏర్పాటుచేసిన చంద్రబాబునాయుడును కాపు ద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్న వైఎస్ జగన్ - ముద్రగడల చీకటి రాజకీయ కుట్రను విజ్ఞలైన కాపు సోదరులందరూ గమనించాలని బోండా ఉమా కోరారు.