Begin typing your search above and press return to search.
బొండా ఉమా దూకుడు మాటల్లో కాదు.. చేతల్లో లేదా ?
By: Tupaki Desk | 27 Jan 2022 10:30 AM GMTవిజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రాజకీయాలు మారుతున్నాయి. గతంలో ఇక్కడ నుంచి గెలిచిన టిడిపి ఫైర్ బ్రాండ్ నాయకుడు బొండా ఉమామహేశ్వరరరావు వచ్చే ఎన్నికల్లో గెలుస్తారా? లేదా? అనే చర్చ జోరుగా సాగుతోంది.వాస్తవానికి ఎన్నికలకు మరో రెండున్నరేళ్లు మాత్రమే ఉంది. కానీ, బొండా ఉమా మాత్రం నియోజకవర్గంలో కనిపించడం లేదు. దీనికి కారణం ఆయన మీడియాలో ఉంటున్నారే తప్ప.. నియోజకవర్గంలో ఉండకపోవడమే. దీంతో బొండా ఉమా గెలుస్తారా? లేదా? అని చర్చ నడుస్తోంది.
వాస్తవానికి రెండేళ్ల పరిస్థితిని తీసుకుంటే కరోనా నేపథ్యంలో ప్రజల మధ్య ఏ నాయకుడు లేరు. అయితే.. కరోనా తగ్గిన తర్వాత ప్రజలను కలిసేందుకు అవకాశం ఉంది. దీంతో చాలా చోట్ల నేతలు.. ప్రజల మద్యకువెళ్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు కూడా ఇదే చెబుతున్నారు. అయినప్పటికీ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో బోండా ఉమా ఎక్కడా కనిపించడం లేదు. కనీసం పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరు కావడం లేదు. దీంతో నియోజకవర్గంలో అసలు టిడిపి ఉందా లేదా అనే చర్చ జోరుగా సాగుతుండటం.. ఇటీవల కామన్ గా మారిపోయింది.
బొండా ఉమా ఎక్కడా కనిపించకపోవడంతో పార్టీ కార్యకర్తలకు కూడా తలనొప్పిగా మారింది. కేవలం రెండు ప్రెస్‌మీట్లు పెట్టి మమ కనిపించటంతో నే సరి పెడుతున్నారని క్షేత్రస్థాయిలో ఎవరిని పట్టించుకోవడంలేదని టిడిపి కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫైర్ బ్రాండ్ నాయకుడిగా కొనసాగేందుకు ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు తప్ప తమను ఏమాత్రం కేర్ చేయటం లేదని కార్యకర్తలు బాహాటంగానే చెబుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
దీంతో అధికార వైసిపి నాయకులు బొండా ఉమా కు యాంటీగా మరింత ప్రచారం పెంచారు. బోండా ఉమా మీడియా నాయకుడని మీడియా ఉంటేనే తప్ప ఆయన పని చేయలేడని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. దీంతో ఉమా ఇప్పటివరకు సంపాదించుకున్న ఇమేజ్ కూడా దెబ్బతినే ప్రమాదం ఏర్పడిందని అంటున్నారు పరిశీలకులు. ఏపీ టిడిపిలోని ఒక వర్గం కూడా ఇదే భావిస్తోంది. మాటలు కాదు.. చేతల్లోనే ఆయన చేరువ కావాల్సి ఉందని అంటున్నరు. మరి ఇప్పటికైనా తనను తాను తగ్గించుకుని.. ప్రజల్లో కలిసిపోతారో లేదో చూడాలి.