Begin typing your search above and press return to search.
బొండావి బ్లాక్ మెయిల్ రాజకీయాలేనా...?
By: Tupaki Desk | 13 Aug 2019 5:58 AM GMTరాజకీయాల్లో అయితే రహదారి లేకుంటే దొడ్డిదారిని ఫాలో అయ్యే నాయకులు చాలా మందే ఉన్నారు. అం దితే.. జుట్టు పట్టుకుంటారు.. లేక పోతే.. కాళ్లు పట్టుకునేందుకు సైతం వెనుకాడబోరు. తమ పని కావాలి. లేక పోతే.. సాధించుకోవాలి. అనే రేంజ్‌లో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి వారు చాలా మందే ఉన్నా.. తాజాగా బెజవాడ సెంట్రల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు ప్రముఖంగా చర్చలోకి వస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన ప్రముఖ వ్యాపార వేత్తల్లో ఈయన కూడా ఒకరు. 2009 నుంచి ఇప్పటి వరకు రాజకీయాల్లోనే ఉన్నారు. సమయానికి తగు మాట్లాడే నాయకుల్లో ఈయన కూడా ముందుంటారు.
గత చంద్రబాబు ప్రభుత్వంలో 2017లో జరిగిన మంత్రి వర్గ విస్తరణకు సంబంధించి చాలానే ఆశలు పెట్టు కున్నారు బొండా. తనకు కాపు కోటాలో అయినా బెర్త్ దక్కక పోతుందా? అని అనుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన అప్పటి విపక్షం వైసీపీపై విరుచుకుపడ్డారు అరెయ్.. రేయ్ అంటూ అసెంబ్లీలోనే చెలరేగిపోయారు. దీంతో బాబు తనను మెచ్చుకుని మేకతోలు కప్పుతారని ఆశించారు. అయితే - అనూహ్యంగా ఈ పదవి దక్కక పోవడంతో ఆయన చంద్రబాబు నాయుడు కాపులకు అన్యాయం చేసారు అన్నాడు మళ్ళీ తరువాత సర్దుకుని మాట మార్చాడు అది అప్పటి సంగతి!
ఈ క్రమంలోనే ఇక - ఆయన పార్టీ మారతారని - తన సామాజిక వర్గం నాయకుడు నటుడు పవన్ ప్రారంభించిన జనసేనలోకి జంప్ చేస్తారని అందరూ అనుకున్నారు. కట్ చేస్తే.. ఉమా.. టీడీపీలోనే ఉన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీ కూడా చేశారు. అయితే, 25 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక, ఇప్పుడు కూడా ఆయన ఈ బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోలేదని అంటున్నారు విశ్లేషకులు. తనకు అన్నిపార్టీల నుంచి ఆఫర్లు వచ్చాయని ఆయన చెప్పడం చూస్తే.. ఇది నిజానికి చంద్రబాబు వంటి సీనియర్‌ను బ్లాక్ మెయిల్ చేయడమే అవుతుందని అంటున్నారు.
కాపులకు చెందిన నాయకుడిగా.. ఆయన ఏమైనా ప్రత్యేక గౌరవాలు - పదవులు కోరుకుంటున్నారా? అలానే అయితే, ఆ విషయాన్ని చంద్రబాబుకు చెప్పడం ద్వారా పరిష్కరించుకునే వెసులుబాటు ఉంటుంది. అలా కాకుండా పార్టీకి దూరంగా ఉంటూ.. తాను పార్టీ మారుతున్నానంటూ.. టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ .. తీరా.. అధినేత వద్ద మాత్రం తనకు బోలెడన్ని ఆఫర్లు ఉన్నాయని చెప్పడాన్ని విశ్లేషకులు తప్పుబడుతున్నారు. ఏన్నాళ్లీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు? అంటూ వారు ప్రశ్నిస్తున్నారు.