Begin typing your search above and press return to search.

పార్టీకి రాజీనామా..జ‌న‌సేన‌లోకి బోండా ఉమ‌

By:  Tupaki Desk   |   2 April 2017 7:06 AM GMT
పార్టీకి రాజీనామా..జ‌న‌సేన‌లోకి బోండా ఉమ‌
X
ఏపీ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో భాగంగా అల‌క‌లు తారాస్థాయికి చేరాయి. పార్టీకి కంక‌ణ‌బ‌ద్దులై ఉంటార‌నుకున్న నేత‌లు త‌మ‌కు బెర్త్ ద‌క్క‌క‌పోవ‌డంపై తీవ్రంగా ఫైర‌య్యారు. త‌న‌కు మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెట్ట‌క‌పోవ‌డంపై ఏపీ సీఎం - పార్టీ అధినేత చంద్రబాబుపై ఎమ్మెల్యే బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. బోండా అసంతృప్తితో ఉన్నార‌ని వార్త తెలిసిన వెంట‌నే పార్టీ ఎంపీలు కేశినేని నాని - కొనకళ్ల నారాయ‌ణ బోండా ఇంటి వ‌ద్ద‌కు చేరారు. ఈ సంద‌ర్భంగా వారివద్ద బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశార‌ని స‌మాచారం.

రౌడీయిజం పేరుతో మంత్రి పదవి ఎగ్గొట్టారని ఎంపీలు - స‌న్నిహితుల వద్ద బోండా ఉమ‌ ఆవేదన వ్య‌క్తం చేశారు. ప్రతిపక్షంపై ఎంతగా విరుచుకుపడ్డానో చంద్రబాబుకు తెలియాదా అని తోటి నేతల వద్ద వాపోయినట్లు స‌మాచారం. అయిన‌ప్ప‌టికీ చంద్ర‌బాబు తనను వాడుకుని వదిలేశారని ఆవేదన వ్య‌క్తం చేశారని తెలుస్తోంది. జనసేన నుంచి ఆహ్వానం ఉన్నా....టీడీపీని వదల లేదని, అయినా గుర్తింపు లేకుండా పోయిందంటూ ఆవేదన చెందిన‌ట్లు చెప్తున్నారు. ఇంత అవమానించినా ఈ పార్టీలో ఎలా కొనసాగాలంటూ బోండా వ్యాఖ్యానించ‌ట్లు చెప్తున్నారు. ఈ క్ర‌మంలో ఎంపీలు బుజ్జగిస్తున్నప్ప‌టికీ పార్టీకి, ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామాపై ససేమిరా అని బోండా తేల్చిచెప్పిన‌ట్లు స‌మాచారం.

మ‌రోవైపు బోండా ఉమాకి మద్దతుగా 18 మంది కార్పోరేటర్లు - 20 డివిజన్ల పార్టీ అధ్యక్షులు రాజీనామాకు సిద్దంగా ఉన్నారు. బోండా ఇంటికి స‌ద‌రు కార్పోరేటర్లు - పార్టీ డివిజన్ అధ్యక్షులు చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో రాజీనామా నిర్ణయాన్ని ప్రకటిస్తారని బోండా అనుచరుల వెల్లడించారు. స‌రైన ప్రాధాన్యం ద‌క్కాలంటే... త‌మ‌ను కించ‌ప‌రిన పార్టీకి జ‌వాబు ఇవ్వాలంటే జ‌న‌సేన‌లో చేర‌డ‌మే స‌రైన నిర్ణ‌య‌మ‌ని బోండాకు అనుచ‌రులు చెప్తున్న‌ట్లు స‌మాచారం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/