Begin typing your search above and press return to search.

జ‌గ‌న్, ప‌వ‌న్ దోస్తీ ఉండ‌దంటున్న టీడీపీ ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   15 April 2017 2:09 PM GMT
జ‌గ‌న్, ప‌వ‌న్ దోస్తీ ఉండ‌దంటున్న టీడీపీ ఎమ్మెల్యే
X
మీడియాతో మాట్లాడేందుకు తెగ ఆస‌క్తి క‌న‌బ‌ర్చే టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ‌మ‌హేశ్వ‌ర రావు ఒకింత గ్యాప్ త‌ర్వాత తెర‌మీద‌కు వ‌చ్చారు. ఈ ద‌ఫా త‌మ పార్టీలోని ప‌రిణామాలు మొద‌లుకొని ఏపీ రాజ‌కీయాలు - నాయ‌కుల భ‌విష్య‌త్ వ్యూహాల గురించి కూడా చెప్పుకొచ్చారు. జ‌న‌సేన అధినేత - ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి విశ్లేషణ చేసిన బోండా ఉమా ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో వైసీపీ పోరాటాన్ని ప‌వ‌న్ ప్ర‌శంసించ‌డం గురించి వివ‌రిస్తూ...త‌మ ఎంపీల‌ను జ‌న‌సేనాని త‌ప్పుప‌ట్ట‌లేద‌న్నారు. ప‌వ‌న్ త‌మ పార్టీతో స‌న్నిహితంగానే ఉన్నార‌ని బోండా విశ్లేషించారు.

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌ తో ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌ట్టుక‌ట్ట‌బోర‌ని బోండా ఉమ జోస్యం చెప్పారు. దొంగ‌ల‌తో దోస్తీ క‌ట్టేది లేద‌ని గ‌తంలో ప‌వ‌న్ స్ప‌ష్టం చేసిన నేప‌థ్యంలో భ‌విష్య‌త్తులో ఈ ఇద్ద‌రి మ‌ధ్య పొత్తు ఉంటుంద‌ని తాను అనుకోవ‌డం లేద‌న్నారు. కాగా, తాజా రాజ‌కీయ ప‌రిణామాల‌పై బోండా ఉమా ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తనపై ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం జరుగుతున్నదని ఆయ‌న వాపోయారు. విపక్ష అనుకూల మీడియా ఉద్దేశపూర్వకంగా తనను బదనాం చేయాలని చూస్తోందని బోండా ఉమా విమర్శించారు. కాపుల గొంతు కోశారని తాను అన్నట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటున్నానని ఆయ‌న‌ సవాల్ చేశారు.

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడితో జీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ భేటీ అవ‌డంలో విశేష‌మేమీ లేద‌ని బోండా ఉమా కొట్టిపారేశారు. తాను రాజ‌కీయ స‌న్యాసం తీసుకున్న‌ట్లు గ‌తంలోనే ల‌గ‌డ‌పాటి ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ఆయ‌న టీడీపీలో చేరుతార‌ని తాను అనుకోవ‌డం లేద‌న్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/