Begin typing your search above and press return to search.

తెలంగాణ ట్యాపింగ్ సంగతేమైంది బోండా?

By:  Tupaki Desk   |   21 Aug 2020 1:30 PM GMT
తెలంగాణ ట్యాపింగ్ సంగతేమైంది బోండా?
X
టీడీపీ నేత బోండా మాష్టారు నోరు విప్పారు. బాబు హయాంలో ఒక వెలుగు వెలిగిన ఆయన.. ఈమధ్యన కాస్త కామ్ గా ఉంటున్నారు. ఉన్నట్లుండి.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెర మీదకు వచ్చింది. ఏపీకి చెందిన న్యాయమూర్తుల ఫోన్ ట్యాపింగ్ అవుతుందంటూ.. కథనం రావటం.. దాని చుట్టూ నెలకొన్న వివాదం తెలిసిందే. దీనిపై కోర్టు స్పందించిన నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లలో హుషారు పెరిగిపోతోంది.

మీడియాముందుకు వచ్చి మాట్లాడేస్తున్న వారంతా.. గతంలో జరిగిన ఒక విషయాన్ని మర్చిపోయినట్లున్నారు. చాలా సందర్భాల్లో టీడీపీ నేతలు మేం లేస్తే.. విషయం మామూలుగా ఉండదన్నట్లుగా మాట్లాడుతుంటారు. సర్లే.. ఒకసారి లేవండి.. చూస్తామంటే మళ్లీ మాట్లాడరు. ఈ మాట అనటానికి కారణం లేకపోలేదు. ఓటుకు నోటు వ్యవహారం చోటు చేసుకున్నప్పుడు.. నాడు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబు నోటి నుంచి కేసీఆర్ సర్కారు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిందన్న మాట అప్పుడప్పుడు అనేవారు.

సమయం వచ్చినంతనే ఆ వివరాల్ని విడుదల చేస్తామన్న మాటను అనేవారు. కానీ.. ఇప్పటివరకు ఆ వివరాలు బయటపెట్టింది లేదు.. ఆ కేసు ఏమైందన్న విషయాన్ని ప్రస్తావించింది లేదు. బాబునోటి నుంచి ఫోన్ ట్యాపింగ్ మాట రాగానే.. ఇప్పటిలానే అప్పుడు కూడా కొందరు తమ్ముళ్లు చెలరేగిపోయారు. కాలక్రమంలో ఏం జరిగిందో తెలిసిందే. తాజా ఉదంతం కూడా అలానే ఉంటుందా? అన్నది క్వశ్చన్.

నిజంగానే ఏదైనా విషయం ఉండి ఉంటే.. ఈ పాటికి బాబు అండ్ కో ఆగమాగం చేసేవారు కదా? అలాంటిదేమీ లేకుండా..ప్రెస్ మీట్లు పెట్టేసి.. ట్యాపింగ్ తో ఏపీ పరువు పోయిందని.. దేశ వ్యాప్తంగా జగన్ సర్కారు చేసిన పనితో తల ఎత్తుకోలేని పరిస్థితి ఉందంటూ మాటలు చెప్పించటం చూస్తే కొత్త సందేహాలు కలుగక మానదు. బాబు తానా అంటే తందానా అనేందుకు.. బోండా లాంటి వాళ్లు ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. గతంలో ఇలానే హడావుడి చేసిన కేసీఆర్ సర్కారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం