Begin typing your search above and press return to search.

పవన్ పై బొండా ఉమా షాకింగ్ కామెంట్స్..: ఇప్పుడే చెప్పలేం..

By:  Tupaki Desk   |   12 Feb 2022 8:40 AM GMT
పవన్ పై బొండా ఉమా షాకింగ్ కామెంట్స్..: ఇప్పుడే చెప్పలేం..
X
ఏపీలో కొద్ది నెలలుగా జనసేన, టీడీపీ పొత్తు ఉంటుందన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే బీజేపీతో కలిసున్న జనసేన ఆ పార్టీతో అధికారికంగా తెగదెంపులు చేసుకోలేదు. అలాగని టీడీపీతో పొత్తు పెట్టుకుంటామన్న క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో ఈ రెండు పార్టీలు కలుస్తాయా..? లేదా..? అనేది సస్పెన్స్ గా మారింది. అయితే జనసేన నాయకుల కంటే టీడీపీ నాయకులే పవన్ పార్టీతో పొత్తుకు ఉత్సాహ పడుతున్నట్లు తెలుస్తోంది.

ఎందుకంటే ప్రెస్ మీట్లు పెట్టిన కొన్ని సందర్భాల్లో పవన్ తో కలిసే వెళ్తామని చెబుతున్నారు. ఇలా చెప్పిన వారిలో టీడీపీలోని తలపండిన రాజకీయ నాయకులు కావడం విశేషం. అయితే జనసేన పార్టీ నుంచి ఎటువంటి స్పందన రావడం లేదు. టీడీపీతో పొత్తు అని ఎవరూ ప్రశ్నించినా నేరుగా సమాధానం చెప్పడం లేదు.

టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా అవసరమైనప్పుడు పొత్తులు అనివార్యమని పరోక్షంగా ప్రకటించారు. అయితే ఆ పోత్తు జనసేనతోనే అని రాజకీయ వర్గాలకు అర్థమైపోయింది. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని విడాకులు తీసుకున్న బాబు మరోసారి ఆ పార్టీల చెంత చేరే అవకాశం లేదనే తెలుస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి ఎన్నికల్లోకి వెళ్లిన బాబు పరాభావమే ఎదురైంది. రాహుల్ గాంధీని సైతం స్వయంగా ఏపీకి తీసుకొచ్చి ప్రచారం చేయించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే అవకాశమే లేదని తెలుస్తోంది. ఇక 2014 ఎన్నికల్లో బీజేపీతో ఎన్నికల బరిలోకి దిగిన బాబుకు బాగానే కలిసొచ్చింది. అయితే ఆ తరువాత రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీని దూరం పెడుతూ వచ్చారు. ఆ క్రమంలో వైసీపీ దగ్గరై బాబును కుర్చీలో నుంచి దింపేశారు. దీంతో ఇక ఎవరితో చేతులు కలపకుండా ఒంటరిగానే పోరాటలు చేస్తున్నారు.

2019 ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్కటే సీటు గెలుచుకున్న జనసేన పార్టీ పరిస్థితి అయిపోయిందని అనుకున్నారు. గెలిచిన ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా అధికార పార్టీ పక్షాన చేరిపోవడంతో జనసైనికులు నిరాశ చెందారు. అయితే పవన్ రాష్ట్రంలోని ఒక్కో సమస్యపై పోరాడుతూ వస్తున్నారు. ముందుగా రైతులు వద్దకు వెళ్లిన పవన్ ఆ తరువాత రోడ్ల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడం మొదలు పెట్టారు. అయితే కొందరు జనసైనికులు చందాలు వేసుకొని రోడ్లను వేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ప్రభుత్వం దిగి వచ్చి రోడ్లను వేయించింది. దీంతో తమ పోరాటానికి ప్రభుత్వం స్పందించిందని జన సైనికులు సంబరాలు చేసుకున్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని చోట్ల జనసైనికులు గెలిచారు. ఎంపీపీ పదవిని సైతం దక్కించుకోవడంతో పార్టీ కార్యకర్తలో ఉత్సాహం నెలకొంది.

ఈ పరిణామాలన్నింటిని గమనించిన టీడీపీ నాయకులు జనసేనతో కలిసి వెళితే బెటరని బాబుకు సూచించారు. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలకు పవన్ ప్రచారం చేయడం కలిసొచ్చింది. ఆ తరువాత పవన్ సొంతంగా పార్టీ పెట్టాడు. ఇప్పుడు ఒంటరిగా వెళ్లేకంటే పవన్ పార్టీతో కలిసి వెళితే బెటరని ఆలోచిస్తున్నారు. దీంతో జనసైనికుల కంటే టీడీపీ నాయకులే కాస్త ఉత్సాహంగా ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ఇటీవల ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీడీపీ సీనియర్ నేత బొండా ఉమా మట్లాడారు. పవన్ తో జతకట్టే విషయంపై ప్రశ్నించగా దానిపై ఇప్పుడే మాట్లాడలేమని చెప్పారు. అయితే ఎన్నికల సమయానికి ఎవరితో పొత్తు పెట్టుకుంటామో.. పొత్తు పెట్టుకున్న తరువాత అప్పుడు ఎవరికి లాభం జరుగుతుంది..? ఎవరికి ఎక్కువ లాభం జరుగుతుంది..? అనేది చర్చించుకుంటామని ఆయన చెప్పారు. అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తుకు పవన్ సై అంటాడా..? లేదా..? చూడాలి..