Begin typing your search above and press return to search.
అరేయ్ చెవిరెడ్డి.. ఒరేయ్ బొండా
By: Tupaki Desk | 20 April 2016 6:17 AM GMTప్రజాప్రతినిధులు వాడే భాష ఈమధ్య బాగా కిందిస్థాయికి దిగజారిపోతోంది. గతంలోనూ నోటికొచ్చినట్లు మాట్లాడే నేతలు ఉన్నప్పటికీ ప్రజా వేదికలపై హుందాగా ప్రవర్తించేవారు. చట్టసభల్లోనూ దాదాపుగా సంయమనం పాటించేవారు. కానీ.... ప్రస్తుత నేతలకు మాత్రం అదేమీ ఉండడం లేదు. ఎక్కడైనా సరే ప్రత్యర్థులపై నోటి జులుం చూపించడమే హీరోయిజంగా భావిస్తున్నారు. ప్రతి పార్టీలోనూ నలుగురైదుగురు నేతలు ఇలాంటి నేచర్ తో వ్యవహరిస్తున్నారు. తాజాగా అలాంటి దుందుడుకు నేతలు ఇద్దరు టీవీ ఛానల్ లైవ్ షో సాక్షిగా తిట్ల పురాణం మొదలుపెట్టారు. అదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ - వైసీపీ శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డిలు బుధవారం ఉదయాన్నే ఒక టీవీ ఛానల్ లైవ్ షో లో వాదులాటకు దిగారు. అరేయ్... ఒరేయ్ అంటూ సిగ్గు లేకుండా తిట్టుకున్నారు. తమ స్థాయిని మరిచి వీధి రౌడీల్లా తిట్టుకున్నారు. అరేయ్... ఒరేయ్ అంటూ సభ్యత సంస్కారాలు మరిచి మాట్లాడారు. ఓ వైపు షో నిర్వాహకుడు వారిస్తున్నా వారిద్దరూ వినిపించుకోలేదు. న్న పాపాన పోలేదు.
రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా, ఇతర విషయాల్లో కేంద్రం చేస్తున్న జాప్యం, నిర్లక్ష్యంపై జరుగుతున్న చర్చలో తొలుత బొండా ఉమా - బీజేపీ - కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. అప్పటిదాకా చర్చ సవ్యంగానే జరుగుతుండగా, ఫోన్ లైన్ ద్వారా చెవిరెడ్డి చర్చలోకి ఎంటర్ కాగానే ఒక్కసారిగా చర్చ పక్కదారి పట్టింది. చెవిరెడ్డి చేసిన ఆరోపణలతో ఒక్కసారిగా సహనం కోల్పోయిన బొండా ఉమా... ఎర్రచందనం దుంగలను దొంగిలించే దొంగవంటూ చెవిరెడ్దిపై విరుకుచుకుపడ్డారు. దుంగలను కొట్టేసిన కేసులో జైలుకు కూడా వెళ్లి వచ్చావు కదా అంటూ ఆయన దెప్పిపొడిచారు. ఈ సందర్భంగా బొండా ఉమా నోటి నుంచి ‘అరేయ్’ అన్న మాట వినిపించింది. ఇదే పదాన్ని ఆయన పదే పదే వాడారు. దీంతో చెవిరెడ్డి కూడా బొండాను ‘ఒరేయ్’ అంటూ సంబోధించారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. దమ్ముంటే తనపై ఆధారాలతో కేసు పెట్టాలని సవాల్ చేశారు. చివరకు చర్చ నిర్వాహకుడు పదేపదే విజ్ఞప్తి చేయగా వారు ఆగారు. ఎదురెదురుగా ఉంటే కొట్టుకునేవారేమో అన్నట్లుగా ఇద్దరూ తిట్టుకున్నారు.