Begin typing your search above and press return to search.
అవశేషాలు... షీనా బోరావేనా?
By: Tupaki Desk | 1 Sep 2015 4:37 PM GMTషీనా బోరా హత్య కేసులో మలుపులే మలుపులు! హత్యకు తల్లే కారణమని అభియోగాలు నమోదవడం ఒక ట్విస్ట్ అయితే.... ఆ తల్లి ఇంద్రాణికి సంబంధించిన ప్రేమకథలు మరో సంచలనం! ఇదే క్రమంలో షీనా బ్రతికే ఉందని, అమెరికాలో నివసిస్తుందని ఇంద్రాణీ చెప్పడం భారీ సంచలనం! తాజాగా మరో అనుమానం ఏంటంటే... మూడేళ్ల కిందట రాయ్‌గఢ్ జిల్లాలో కొన్ని అవశేషాలు లభించాయి, అవి షీనా బోరా వేనా అనే అనుమానాలు రేగుతున్నాయి. అయితే... అవి ఎవరికి చెందినవో ఇంకా గుర్తించాల్సి ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మామూలుగా అయితే డీఎన్ ఏ టెస్టును ఆశ్రయిస్తారు. అయితే... ఆ టెస్టుకు కూడా అందకుండా మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసే రాక్షసులూ ఉంటారు. ఇక్కడి అవశేషాలు కూడా దాదాపు అదేస్థితిలో ఉన్నాయంటున్నారు. ఇలా ఉంటే డీఎన్ ఎని గుర్తించడం కాస్త కష్టమే అంటున్నారు ఫోరెన్సిక్ నిపుణులు.
అయితే... ఇప్పుడు షీనా బోరాగా అనుమానిస్తున్న అవశేషాలను 2013 మే 23న రాయ్‌గఢ్ పోలీసులు సేకరించారు. ఎన్నాళ్లు వేచి ఉన్నా ఎలాంటి మిస్సింగ్ కేసులూ దాఖలు కాకపోవడంతో వాటిని, ముంబైలోని జేజే హాస్పిటల్ కి పంపించేశారు. ఈ అవశేషాల్లో పంటి ఎముకలు, స్కల్, కొన్ని పంటి శాంపిల్స్ ఉన్నాయని చెబుతున్నారు. అయితే... వీటిని 2డి, 3డి టెక్నాలజీల ద్వారా ఎవరివి అనేది గుర్తించ వచ్చని నిపుణులు అంటున్నారు. 2డిగానీ, 3డిగానీ కంప్యూటర్ సూపర్ ఇంపోజ్ చేసి ఆ స్కల్ ని ముఖంగా మార్చవచ్చు అని చెబుతున్నారు. అయితే, ఈ టెక్నాలజీ ముంబైలోకి క్రైమ్ హాస్పిటల్, ఛండీగడ్ లోని ఎఫ్ ఎస్ ఎల్ లో మాత్రమే ఉందట. 2డి ద్వారా ముఖాన్ని తయారు చేయాలంటే... అనుమానితుల ఫొటోతోపాటు, ఫోరెన్సిక్ ఆంత్రోపాలజిస్ట్, చిత్రకారుడు సాయంతో ముఖాన్ని రూపొందించవచ్చు. త్రీడీలో టెక్నాలజీలో అయినా కూడా ఇదే తరహాలో ముఖ నమూనా తయారు చెయ్యొచ్చు.
గతంలో ఇలాంటి టెక్నాలజీని పోలీసులు వినియోగించుకున్న సందర్భాలు ఉన్నాయి. సంచలన నిఠారీ హత్యకేసులో 19 మంది స్కల్స్ కి గానూ ఈ టెక్నాలజీ సాయంతో 16 మందివి ముఖాలు తయారు చేసి, కచ్చితంగా గుర్తించారు. అయితే... ఇప్పుడు షీనా బోరావిగా అనుమానిస్తున్న ఈ అవశేషాలపై ఇలాంటి పరీక్షలు జరుగుతాయా లేదా అన్నది ఇంకా తేలాల్సి ఉంది!