Begin typing your search above and press return to search.

బోనిని పోలీసులు ఇంట‌రాగేట్ చేయ‌లేద‌ట‌

By:  Tupaki Desk   |   27 Feb 2018 4:55 AM GMT
బోనిని పోలీసులు ఇంట‌రాగేట్ చేయ‌లేద‌ట‌
X
శ్రీ‌దేవి మ‌ర‌ణం ఒక సంచ‌ల‌నం అయితే.. ఆమె మ‌ర‌ణం స‌హ‌జ‌మా? అస‌హ‌జ‌మా? అన్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. ఆమె మ‌ర‌ణానికి సంబంధించి దుబాయ్ అధికారులు అనుస‌రిస్తున్న విధానం.. అందుకు సంబంధించి విడుద‌ల చేసిన ప‌త్రాలు.. ఆమె పార్థిప‌దేహాన్ని ముంబ‌యికి పంపించేందుకు నో చెబుతున్న తీరు.. ఈ విష‌యంపై కొత్త కొత్త సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఇదిలా ఉంటే.. శ్రీ భ‌ర్త బోనీక‌పూర్ ను దుబాయ్ పోలీసులు గంట‌ల కొద్దీ విచారించిన‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. మ‌రోవైపు.. ఆయ‌న్ను పోలీసులు ఇంట‌రాగేష‌న్ చేసిన‌ట్లుగా వ‌స్తున్న వార్త‌ల్లో ఏ మాత్రం నిజం లేద‌ని.. ఈ ఎపిసోడ్ ను మొద‌టి నుంచి ఎక్స్ క్లూజివ్ స‌మాచారాన్ని అందిస్తున్న ఖ‌లీజా టైమ్స్ మ‌రోసారి ఉటంకించింది. శ్రీ‌దేవి కేసుకు సంబంధించి బోనీక‌పూర్ ను దుబాయ్ పోలీసులు ఇంట‌రాగేట్ చేయ‌లేద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. మ‌న ఛాన‌ళ్లు..కొన్ని ప్ర‌ముఖ మీడియా సంస్థ‌ల‌కు చెందిన వెబ్ సైట్లు మాత్రం.. బోనీక‌పూర్ ను ఇంట‌రాగేట్ చేసిన‌ట్లు పేర్కొన‌ట‌మే కాదు.. ఈ రోజు (మంగ‌ళ‌వారం) అరెస్ట్ చేసే అవ‌కాశం ఉంద‌న్న వార్త‌లు వేసేస్తున్నారు. అయితే.. ఇలాంటి వార్త‌లు తొంద‌ర‌పాటు అని.. సంచ‌ల‌నం కోసం ఇలా వార్త‌లురాయ‌టం స‌రికాద‌న్న మాట‌ను దుబాయ్ కు చెందిన పాత్రికేయులు చెబుతున్నారు. ఖ‌ర్మ కాకుంటే..మ‌న మీడియా వాళ్ల అత్యుత్సాహం ఇప్పుడు దేశం కాని దేశానికి చెందిన పాత్రికేయులు.. మీడియా సంస్థ‌లు ఖండించే ప‌రిస్థితి.