Begin typing your search above and press return to search.
కొత్త మేయర్ కు కేబినెట్ హోదా కావాలట
By: Tupaki Desk | 13 Feb 2016 6:14 AM GMTగ్రేటర్ హైదరాబాద్ కు మేయర్ గా ఎంపికైన బొంతు రామ్మోహన్ తనకు కేబినెట్ ర్యాంకు కావాలని అడుగుతున్నట్లు సమాచారం. దీనిపై ఆయన లిఖిత పూర్వకంగా కోరనప్పటికీ ప్రభుత్వ పెద్దల వద్ద తన మనసులోని కోరికను వెల్లడించారని.... అది ప్రభుత్వ పరిశీలనలో ఉందని సమాచారం. నిజానికి గ్రేటర్ మేయర్ కు మంచి సదుపాయాలే ఉంటాయి. కానీ, రామ్మోహన్ వాటితోపాటు అదనంగా మినిష్టర్ హోదా కోరుకుంటున్నారట.
మేయర్ రామ్మోహన్ - డిప్యూటీ ఫసీయుద్దీన్ లు అధికారులను ప్రశ్నలతో వేధిస్తున్నారట. ఈ పదవుల్లో ఉంటే తమకు ఏఏ సౌకర్యాలు ఉంటాయన్నవన్నీ తెలుసుకుంటున్నారట. అంతేకాకుండా తమకు కొన్ని సదుపాయాలు కల్పించాలంటూ ఇద్దరూ అధికారులను కోరారని సమాచారం. భద్రతగా గన్ మెన్లను ఇవ్వాలని.... ఇప్పుడున్న వాహనాల స్థానంలో ఫార్చూనర్ వాహనాలు కొనాలని... కార్పొరేషన్ కు వారు వచ్చినప్పుడు వారితో పాటు 50 మంది వరకు ఉచితంగా భోజన సదుపాయం కల్పించాలని... ఇలా చాలా కోరికలు కోరుతున్నారట. అయితే అధికారులు మాత్రం ప్రభుత్వానికి నివేదించి అనుమతి వస్తే కల్పించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెబుతున్నారు. కొత్తగా ఎన్నికయ్యేవారు సదుపాయాలు - జీతభత్యాలు వంటివన్నీ తెలుసుకుంటుంటారని... అది సాధారణమేనని... కొందరు అదనంగా సదుపాయాలు కోరుతారని సీనియర్ అధికారులు చెబుతున్నారు. కొందరు మాత్రం ఇవన్నీ పట్టించుకోకుండా పాలనకు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకుని అవగాహన పెంచుకుంటారని చెబుతున్నారు. అధికారుల నర్మగర్భ మాటలను చూస్తుంటే వీరిద్దరికీ పాలన కంటే సౌకర్యాలపైనే దృష్టి ఉందని సెటైర్ వేసినట్లుంది.