Begin typing your search above and press return to search.
సుమేధ మృతిలో జీహెచ్ ఎంసీ తప్పే లేదట! మేయర్ ప్రకటన
By: Tupaki Desk | 20 Sep 2020 1:30 PM GMTగ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నేరేడ్మెట్ ఓపెన్ నాలాలో పడి సుమేధ(12) అనే బాలిక మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనపై నేరేడ్ మెట్ వాసులు తీవ్రంగా స్పందించారు. జీహెచ్ ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లే చిన్నారి చనిపోయిందని ఆరోపించారు. తాజాగా ఈ ఘటనపై మేయర్ బొంతు రామ్మోహన్ స్పందించారు. జీహెచ్ ఎంసీ తప్పుఏమి లేదన్నట్టుగా ఆయన మాట్లాడారు. దీంతో మేయర్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సుమేధ ఏలా చనిపోయింది?
నేరేడ్ మెట్ కు చెందిన అభిజిత్ - సుకన్య దంపతుల కూతురు సుమేధ. తల్లిదండ్రుల ఇద్దరూ ఆఫీసుకు వెళ్లారు. ఇంట్లో నాన్నమ్మ సుమేధ మాత్రమే ఉన్నారు. అయితే ఆడుకోవడానికి బయటకు వెళ్తున్నానంటూ నాన్నమ్మకు చెప్పిన సుమేధ సైకిల్ మీద ఇంటి నుంచి బయలుదేరింది. చిన్నారి ఈస్ట్ దీన్ దయాల్ నగర్ చేరుకోగానే ఉధృతంగా నాలా ప్రవహిస్తుండటంతో అందులో సైకిల్ తోపాటు కొట్టుకొని పోయింది. రాత్రైనా చిన్నారి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం సీసీకెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జీహెచ్ ఎంసీ సిబ్బంది తీవ్రంగా గాలించగా.. శనివారం బండచెరువులో బాలిక మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై చిన్నారి తల్లిదండ్రులు - కాలనీవాసులు తీవ్రంగా స్పందించారు. జీహెచ్ ఎంసీ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల తన కూతురు చనిపోయిందిని చిన్నారి తండ్రి ఆరోపించాడు. నాలా మీద జాలి ఏర్పాటు చేసి ఉంటే తన కూతురు బతికి ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు.
రామ్మోహన్ స్పందన..
ఈ ఘటనపై ఆలస్యంగా మేల్కొన్న మేయర్ బొంతు రామ్మోహన్ అసలు చిన్నారి తప్పిపోయిందని చెప్తున్న ప్రాంతంలో వర్షమే పడలేదు. చిన్నారి మృతిపై అనుమానాలు ఉన్నాయి. ఈ ఘటనలో జీహెచ్ ఎంసీ నిర్లక్ష్యమే లేదంటూ చెప్పకొచ్చారు. మేయర్ ఏమన్నారంటే.. ‘సుమేధ మృతిపై నాకు అనుమానాలు ఉన్నాయి. చిన్నారి చనిపోయిన రోజు ఆ ప్రాంతంలో వర్షం పడలేడు. మోకాలి లోతు నీరు నిలిచే అవకాశం లేదు. నాలాలో పడి మృతదేహం రెండుమీటర్లు కొట్టుకొని వెళ్లే అవకాశం లేదు. పూర్తి వివరాలు వచ్చాక జీహెచ్ ఎంసీ తప్పు ఉంటే పరిహారం విషయం ఆలోచిస్తాం’ కాగా మేయర్ సమాధానంతో కాలనీవాసులు మండిపడ్డారు. జీహెచ్ ఎంసీ సిబ్బందిని రక్షించేందుకు మేయర్ అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు.