Begin typing your search above and press return to search.
కంచ ఐలయ్య కన్ను వైశ్యుల మీద పడింది
By: Tupaki Desk | 11 Sep 2017 5:27 AM GMTఎవడి మతం వాడికి గొప్ప. ఎవడి కులం వారికి గ్రేట్. ఎవడూ పుడుతూనే.. ఫలానా కులంలోనూ.. ఫలానా మతంలోనూ పుట్టాలనుకోడు. అదేం ఖర్మో కానీ.. ఒకేలా పుట్టినప్పటికీ.. కులాల వారీగా వారికి గౌరవ మర్యాదల్ని అంటగట్టే అనాగరిక ప్రపంచంలోనే ఇప్పటికీ ఉన్నాం. డిజిటల్ ప్రపంచంలోనూ కులాల సంకెళ్లకు బంధీలుగా ఉండిపోయాం.
కొన్ని వందల ఏళ్ల కిందట స్టార్ట్ చేసిన కుల వ్యవస్థ మొత్తం నాటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా సాగిందన్నది నిజం. దీన్ని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే.
అయితే.. వందల ఏళ్ల క్రితం నాటి వారు చేసింది తప్పా? ఒప్పా? అంటే.. ఎవరు చూసే కోణానికి తగ్గట్లుగా సమాధానం ఉంటుంది. ఒకవేళ.. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేవారంతా ఒక్క విషయాన్ని మాత్రం అస్సలు మిస్ కాకూడదు. సైన్స్ ఇంతగా అభివృద్ధి చెంది.. ప్రపంచమంతా ఒక కుగ్రామంగా మారి.. రకరకాల భావజాలాలు సమ్మిళితమై.. వాక్ స్వాతంత్య్రానికి ఇంత అవకాశం ఉన్న నేపథ్యంలో వందల ఏళ్ల నాటి పరిస్థితుల గురించి కామెంట్ చేసేటప్పుడు.. అప్పటి పరిస్థితులు.. నాటి ప్రజల మానసిక స్థితిగతుల మీద పూర్తి స్థాయి అవగాహన లేకుండా బురద చిమ్మటం సరి కాదు.
ఇప్పుడు కంచ ఐలయ్య లాంటి మేధావులకు.. చాలానే అంశాలు తప్పుగా తోస్తాయి. అలా తోయటం తప్పేం కాదు. తనకు తప్పుగా తోచిన అంశాల్ని చెప్పొద్దని కూడా ఎవరూ అనరు. కానీ.. తాను చెప్పే మాటలు.. రాసే రాతలు ఒక వర్గాన్ని కించపరిచేలా.. అవమానించేలా.. మనోభావాలు దెబ్బ తీసేలా ఉండకూడదు. ఎందుకంటే.. అప్పుడెప్పుడో వందల ఏళ్ల నాడు జరిగిందని చెప్పే తప్పులను ఎత్తి చూపే ఐలయ్య లాంటోళ్లు.. ఇప్పటి వారిని ఎందుకు అవమానించటం.
మరికాస్త సింఫుల్ గా చెప్పాలంటే.. ఒక ప్రభుత్వాన్ని దారుణంగా తిరస్కరించిన ప్రజలు.. కొద్ది సంవత్సరాల తర్వాత అంతే భారీగా భుజానికి ఎత్తుకునే పరిస్థితి. అంటే.. కాలంతో పాటు ప్రజల అభిప్రాయాల్లోనూ మార్పు వస్తుంటుంది. అలాంటప్పుడు.. అప్పుడెప్పుడో ఒక వర్ణం వారు తప్పు చేసి ఉంటారనుకుంటే.. ఆ పేరుతో ఇప్పుడు తిట్టటం ఏమిటి? ఇప్పటికి తప్పులు చేస్తుంటే..వాటిని ఎత్తి చూపటం తప్పు లేదు. ఒకవేళ అలా చేయాలనుకుంటే.. అన్ని వర్ణాల లోని తప్పుల్ని ఎత్తి చూపాలి.
హిందూ దేవుళ్ల అమ్మలక్కలు తిట్టేసే మేధావులు.. మిగిలిన మతాల్లోని లోపాల్ని ఎత్తి చూపటానికి మాత్రం వారి మేధావితనం అక్కరకు రాకపోవటంతోనే అసలు సమస్య. మేధావులైన వారు సైతం అల్ప జీవుల మాదిరి అల్పంగా తమ అభిప్రాయాల్ని చెప్పటంతోనే అసలు సమస్యంతా.
తాజాగా వైశ్య జాతిని ఉద్దేశించి కంచ ఐలయ్య రాసిన పుస్తకం గురించే చూద్దాం. సామాజిక స్మగ్లర్లు.. కోమటోళ్లు అంటూ ఒక పుస్తకాన్ని అచ్చేశారు. ఈ పుస్తకం హెడ్డింగ్ లలోనే అభ్యంతరం ఉంది. ఒక కులం మొత్తాన్ని స్మగర్లుగా ఎలా అభివర్ణిస్తారన్నది ఒక ప్రశ్న అయితే.. కోమటోళ్లు అంటూ అంత చులకనగా మాట్లాటం ఏమిటన్నది మరో ప్రశ్న. ఒక సామాజిక వర్గాన్ని తక్కువ చేసి మాట్లాడటం ఏమిటన్న ఆగ్రహం పలువురు వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి వర్ణాన్ని తమదైన శైలిలో చులకన చేస్తుంటారు. ఆ క్రమంలోనే ఆర్యవైశ్యుల్ని కోమటోళ్లు అంటూ చులకనగా పిలిచేవారు. కానీ.. మారిన కాలంలో కోమటోళ్లు అన్న మాట వ్యవహారికంగా దాదాపుగా కనుమరుగైపోయింది. ఆ విషయం ఐలయ్య లాంటి మేధావులకు తెలియంది కాదు. కానీ.. సదరు వర్గానికి మంటపుట్టేలా కోమటోళ్లు అన్న మాటను ఎత్తి చూపించటంలోనే అయ్యగారి లక్ష్యం ఏమిటో ఇట్టే అర్థమవుతుంది.
ఇక.. పుస్తకంలో ఎలాంటి ముచ్చట్లు ఉంటాయో తెలియంది కాదు. ఎవరి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా పుట్టే మనిషి కులానికి అపరమేధావి అయిన ఐలయ్య ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు? సామాజిక దోపిడీని కులం యాంగిల్‌లోనే ఎందుకు చూస్తారు? నేరానికి పాల్పడేవారిని.. వారు చేసే నేరం కోణంలోనే చూస్తారు తప్పించి.. వారి కులాన్ని ప్రాతిపదికగా తీసుకొని చూడరు కదా? నిజానికి అగ్రవర్ణాలుగా ముద్ర వేసుకున్నప్పటికీ.. వైశ్యులు సామాజిక దళితులన్న విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు. సంపద ఉన్నా.. సమాజంలో గౌరవ మర్యాదల విషయంలో ఆ వర్గానికి ఇచ్చేదెంత అన్నది ఐలయ్య రాసిన పుస్తకాన్ని చూస్తేనే అర్థమవుతుంది. ఇలాంటి పుస్తకాలతో తన మేధావితనాన్ని తనకు తానే తగ్గించుకునే ఐలయ్య లాంటి మేధావులు సమాజానికి మేలు కంటే కీడే ఎక్కువ చేస్తారని చెప్పక తప్పదు. ఇలాంటి రాతలు లేనిపోని ఉద్రిక్తతలకు తెర తీస్తాయన్న నిజాన్ని చట్టం ఎంత త్వరగా గుర్తిస్తే.. అంత మంచిది. ఇలాంటి విషం కక్కే పుస్తకాల్ని కులాలకు అతీతంగా ఖండించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.