Begin typing your search above and press return to search.
ఎయిరిండియాలో జర్నీనా? ఇలాంటి పిచ్చ రూల్స్ పెట్టేయొచ్చు
By: Tupaki Desk | 8 March 2021 4:39 AM GMTలాక్ డౌన్ అనంతరం.. అన్ లాక్ సిరీస్ లో ఎప్పుడూ లేని కొత్త రూల్ ను తాజాగా ఎయిరిండియా తీసుకొచ్చిన వైనం తలనొప్పిగా మారింది. ఎయిరిండియాలో టికెట్ ఎందుకు బుక్ చేసుకున్నామన్న భావన కలిగేలా చేస్తోంది. సాధారణంగా అంతర్జాతీయ విమాన ప్రయాణాలు చేసే వారు కోవిడ్ టెస్టు చేయించుకోవటం.. దానికి సంబంధించిన రిపోర్టులను చూపించి.. నెగిటివ్ గా ఉన్న వారు ప్రయాణించటానికి అవకాశం ఉంటుంది.
అందుకు భిన్నంగా ఆదివారం శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఎయిరిండియా విమానం ఎక్కాల్సిన ప్రయాణికులకు.. ఆ సంస్థ చెప్పిన నిర్ణయం షాకింగ్ గా మారింది. కోవిడ్ 19 టెస్టు రిపోర్టు లేదంటూ.. పలువురు ప్రయాణికుల్ని విమానం ఎక్కటానికి అనుమతించలేదు. దీంతో.. పలువురు ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. ఎయిర్ లైన్స్ తీరును వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు.
ఈ క్రమంలో ఒక విద్యార్థిని కోల్ కతాలో పరీక్షలు రాసేందుకు వెళ్లాల్సి ఉంది. ఇలాంటి వారెందరో. కోవిడ్ టెస్టు రిపోర్టు ఉన్న వారిని మాత్రమే విమాన ప్రయాణానికి అనుమతిస్తామని ముందుగా సమాచారం ఇచ్చి ఉంటే బాగుండేదని.. అందుకు భిన్నంగా ఎయిర్ పోర్టుకు వచ్చాక చెబితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఎయిరిండియా వాదన మరోలా ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి కోల్ కతాకు వచ్చే ప్రయాణికులు తమ వద్ద ఆర్టీపీసీఆర్ రిపోర్టు తప్పనిసరిగా ఉండాలన్న ప్రకటనను ఫిబ్రవరి 27న ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. అయితే.. ఈ అంశానికి సంబంధించి ఎలాంటి ప్రచారం మీడియాలో సాగకపోవటంతో పలువురు ప్రయాణికులు ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు.
అయినా..మిగిలిన ఎయిర్ లైన్స్ వారు అనుమతిస్తున్నప్పుడు.. ఎయిరిండియా మాత్రమే ఇలాంటి నిర్ణయాన్ని అమలు చేయటం సరైనదేనా? అన్నది ప్రశ్నగా మారింది. ఇటీవల కాలంలో కేసుల సంఖ్య పెరుగుతున్న వేళ.. కొన్ని రాష్ట్రా ప్రభుత్వాలు తమ రాష్ట్రానికి వచ్చే ప్రయాణికుల విషయంలో కొన్ని నిబంధనల్ని అమలుచేస్తోంది. ప్రయాణం పెట్టుకుంటే.. అలాంటి వాటి గురించి ముందుగా తెలుసుకొని బయలుదేరండి. లేదంటే.. తిప్పలు తప్పవు.