Begin typing your search above and press return to search.

బీజేపీ ఉద్య‌మ పార్టీ అంట‌.. బూర మాట‌లు పేలుతున్నాయే!

By:  Tupaki Desk   |   20 Oct 2022 1:30 PM GMT
బీజేపీ ఉద్య‌మ పార్టీ అంట‌.. బూర మాట‌లు పేలుతున్నాయే!
X
త‌మ‌కు న‌చ్చింది.. కొన‌సాగ‌వ‌చ్చు. త‌మ‌కు న‌చ్చ‌లేదు.. దూరం కావొచ్చు. రాజ‌కీయాల్లో శాశ్వ‌త మిత్రులు కానీ, శాశ్వ‌త శ‌త్రువులు కానీ.. ఉండ‌రు. సో.. ఈ కోవ‌లోనే.. తెలంగాణ‌లో కొంద‌రు నాయ‌కులు అధికార పార్టీతోవిభేదించారు. దూర‌మ‌య్యారు. అయితే.. వారు పార్టీని వీడి. పొరుగు పంచ‌న చేరి.. ఆ పార్టీ కండువా క‌ప్పుకోవ‌డంతో పాటు.. అప్ప‌టి వ‌ర‌కు ఉన్న పార్టీపై నిప్పులు చెర‌గ‌డ‌మే.. చ‌ర్చ‌కు దారితీసింది. వాస్త‌వానికి సాధార‌ణ నాయ‌కులు అయితే.. ఎవ‌రూ ఏమీ అనుకునేవారు కాదు.కానీ.. డాక్ట‌ర్‌గా ప‌నిచేసి.. ఉన్న‌త విద్య‌ను అభ్య‌సించిన బూర న‌ర్స‌య్య గౌడ్‌వంటి వారే.. నోరు జార‌డ‌డం.. విస్మ‌యానికి గురి చేస్తోంద‌ని.. తెలంగాణ స‌మాజం వ్యాఖ్యానిస్తోంది.

ఇంత‌కీ గౌడ్ ఏమ‌న్నారంటే...

ప్రస్తుత రాజకీయాలు మనం ఊహించలేమని నర్సయ్య గౌడ్ అన్నారు. తెలంగాణ వచ్చాకే దారుణాలు ఎక్కువయ్యాయని ఆరోపించారు. నిస్వార్థంగా పనిచేసిన వాళ్లే బీజేపీలో చేరుతున్నారని పేర్కొన్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అయిన బీజేపీలో చేరానన్నారు. బీజేపీ ఉద్యమ పార్టీ అయితే టీఆర్ ఎస్ ఉద్యమ ద్రోహుల పార్టీగా రూపాంతరం చెందిందని ఆరోపించారు.ఉమ్మడి ఏపీలో కంటే తెలంగాణ రాష్ట్రంలో నిర్భందాలు ఎక్కువయ్యాయ ని విమర్శించారు. టీఆర్ ఎస్‌ను ఎందుకు వీడుతున్నారో ప్రజలు గ్రహించాలని సూచించారు.

ఆత్మగౌరవం కోసం ఈటల రాజేందర్, స్వామి గౌడ్, జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి తాను టీఆర్ ఎస్‌ను వీడారని గుర్తు చేశారు. వైద్య వృత్తి నుంచి తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమకారుడిని అయ్యానని బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. భువనగిరి ఎంపీగా ఎన్నికై కేంద్ర ప్రభుత్వం సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచానని గుర్తు చేశారు. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ప్రగతిభవన్కు ఏవరైనా వెళ్లాలంటే సంవత్సరాలు, దశాబ్దాలు పట్టొచ్చని గౌడ్ ఎద్దేవా చేశారు.

మునుగోడు ఉప ఎన్నిక కారణంగా కేసీఆర్ గట్టుప్పల్ మండలం ఇచ్చారని పేర్కొన్నారు. ఉప ఎన్నిక తరువాత నేతలు వరదలాగా బీజేపీలో చేరుతారని పేర్కొన్నారు. ప్లోరోసిస్ పోయిందని చెబుతున్న అధికార పార్టీ నేతలు ఫ్లోరోసిస్ అధ్యయన కేంద్రం ఎందుకు కోరుతున్నారని ప్రశ్నించారు. అయితే.. ఈ వ్యాఖ్య‌ల‌పైనే నెటిజ‌న్లు నిప్పులు చెరుగుతున్నారు. ఉన్న‌న్నాళ్లు ఉండి.. తిన్న‌న్నాళ్లు తిని.. ఇప్పుడు త‌ల్లిపార్టీకే ద్రోహం చేశార‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.