Begin typing your search above and press return to search.
రోగ నిరోధక శక్తిని ఇలా పెంచుకోండి!
By: Tupaki Desk | 22 July 2020 11:30 PM GMTకరోనా ప్రబలుతోంది.. కోరలు చాస్తోంది. అసలు మందే లేని ఈ మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి కేవలం రోగనిరోధక శక్తి మాత్రమే పెంచుకోవాలి. వ్యాక్సిన్ వచ్చే వరకు ఈ వ్యాధి నుంచి రక్షించుకోవాలి. రోగ నిరోధక శక్తిని పెంచుకుంటే శరీరం అనేక రుగ్మతల నుంచి దూరం చేస్తుంది.రోగ కారక క్రిములతో ఫైట్ చేస్తుంది.
మరి రోగనిరోధక శక్తిని పెంచుకోవాలంటే ఏం చేయాలనేది ఇక్కడ తెలుసుకోవాలి. కొన్ని రకాల నియమాలను తప్పనిసరిగా పాటించాలి. మధ్యపానం.. ధూమపానం రెండింటికి తప్పనిసరిగా దూరంగా ఉండాలి. అలా దూరంగా ఉంటేనే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
ప్రతిరోజు భోజనంలో తప్పనిసరిగా పెరుగు ఉండేలా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే శరీరానికి విటమిన్-డీ అవసరమని.. ఉదయం ఎండలో డి విటమిన్ ఉంటుందని.. ఉదయాన్నే ఎండలో కాసేపు నిలబడడం మంచిదని సూచిస్తున్నారు. అదే విధంగా ఉదయం ఖచ్చితంగా 15-20 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఇక డ్రైఫ్రూట్స్ ఎక్కువగా తినాలని.. వీటిల్లో ఫైబర్, విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. శరీరానికి ఇవి చాలా అవసరమని.. ప్రతి మనిషి తప్పనిసరిగా 7-8 గంటల పాటు నిద్రపోవాలని సూచిస్తున్నారు. ప్రతీరోజు ఒకే సమయంలో నిద్రపోయే విధంగా అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు.
ఇవన్నీ పాటిస్తే మనలో రోగనిరోధకత పెరిగి వ్యాధులు చుట్టుముట్టవు అని వైద్యులు సూచిస్తున్నారు.