Begin typing your search above and press return to search.

బూస్టర్ డోస్ ప్రభావం తక్కువే.. ఆ డోసు కూడా అవసరం!

By:  Tupaki Desk   |   13 Feb 2022 7:30 AM GMT
బూస్టర్ డోస్ ప్రభావం తక్కువే.. ఆ డోసు కూడా అవసరం!
X
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపాటు కు గురి చేసింది. 2019 డిసెంబర్ లో పుట్టిన ఈ వైరస్... దాదాపు అన్ని దేశాలకు పాకింది. వేరియంట్ల మాదిరిగా విరుచుకుపడుతూ ఎంతో మందిని పొట్టన బెట్టుకుంది. తొలి దశలో మెడిసిన్ లేని మహమ్మారికి వణికించింది. ఆ తర్వాత పలువురు శాస్త్రవేత్తలు, ఫార్మా కంపెనీలు శ్రమించి... పలు రకాల టీకాలు అందుబాటులోకి తీసుకొచ్చాయి. అగ్రరాజ్యం చిన్న దేశం అనే తేడా లేకుండా కోరలు చాచిన వైరస్ ను కట్టడి చేయడానికి వ్యాక్సిన్లే శక్తిమంతమైన ఆయుధాలు అని నిర్ధారణ అయ్యాయి.

వివిధ దేశాల్లో ఆయా రకాల టీకాలు అందుబాటులో ఉన్నాయి. అభివృద్ధి దశలో అత్యవసర వినియోగానికి అనుమతులు పొందాయి. ఈ మేరకు వైరస్ ను కాస్త కట్టడి చేయగలిగారు. అయితే ఇప్పటికే రెండు డోసులు వేసుకున్న తర్వాత ప్రికాషన్ డోసు, బూస్టర్ డోస్ అంటూ మోతాదులను పెంచుతున్నారు.

తొలుత రెండు డోసులు సరిపోతాయని వైద్య నిపుణులు చెప్పారు. ఆ తర్వాత వివిధ దేశాల్లో మోతాదుల సంఖ్యను పెంచుతున్నారు. అమెరికాలో మూడో డోసు ప్రక్రియ వేగవంతం గా సాగుతుంది. అయితే థర్డ్ డోసు తీసుకున్న వారిలో రోగనిరోధక శక్తిని పరీక్షిస్తున్నారు. దానిపై పలు పరిశోధనలు చేస్తున్నారు. కాగా అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కీలక అంశాలను వెల్లడించింది.

మూడో డోసు తీసుకున్నవారిలో యాంటీబాడీలపై పరిశోధనలు చేస్తున్నారు. తొలుత థర్డ్ డోసు ఇచ్చిన వారిలో ఈ పరీక్షలు చేశారు. అయితే రోజు రోజుకూ టీకా సామర్థ్యం తగ్గుతోందని గుర్తించినట్లు వెల్లడించారు.

మొదటి నెలలో 91 శాతం ప్రభావం చూపిన టీకా.. నాలుగు నెలలో 78 శాతానికి పడిపోయిందని తెలిపింది. మరిన్ని నెలల్లో టీకా సామర్థ్యం మరింతగా తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది. బూస్టర్ డోసు ప్రభావం చాలా తక్కువగా ఉందని గుర్తించినట్లు స్పష్టం చేసింది. కేసులను జీరోకు చేర్చాలంటే వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరం సాగాలని పేర్కొంది.

వైరస్ నుంచి దేశాలు పూర్తిగా విముక్తి పొందాలంటే మరికొన్ని డోసులు అవసరమని తేల్చింది. అమెరికాలో ఉపయోగించే ఫైజర్, మోడెర్నా టీకాలు తీసుకున్న వారిపై పరిశోధనలు జరిపింది. బూస్టర్ డోస్ ప్రభావం తక్కువగా ఉన్నందున... నాలుగో డోసును కూడా వేయాల్సిన అవసరం ఉందని సూచించింది.

గత ఏడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది జనవరి చివరి వారం వరకు దాదాపు రెండున్నర లక్షల మంది వైరస్ బారిన పడ్డారని తెలిపింది. వారిలో ఆస్పత్రిలో చికిత్స పొందిన 93 వేల మందిపై ఈ పరీక్షలు చేసినట్లు వివరించింది. కరోనా ఫ్రీ ప్రపంచంగా మారాలంటే కొన్ని డోసుల టీకా అవసరం కావొచ్చునని అభిప్రాయపడింది.