Begin typing your search above and press return to search.

అలాంటి వాటి కోసం విదేశాలకు వెళ్లే వారికి బూస్టర్ డోస్..!

By:  Tupaki Desk   |   28 March 2022 12:30 AM GMT
అలాంటి వాటి కోసం విదేశాలకు వెళ్లే వారికి బూస్టర్ డోస్..!
X
వివిధ అవసరాల నిమిత్తం విదేశాలకు వెళ్లే వారికి కొవిడ్-19 టీకా ముందు జాగ్రత్త బూస్టర్ డోస్ అంటే మూడో డోస్ వేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. ఈ మేరకు విదేశాలకు వెళ్లాలనుకునే వారికి బూస్టర్ డోస్ వేసేందుకు అనుమతి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా విద్య, ఉద్యోగాలు, క్రీడల కోసం... అలాగే అధికారిక లేదా వ్యాపార సంబంధిత కార్యక్రమాలకు గాను వెళ్లాలనుకునే వారికి ఈ బూస్టర్ డోసులు ఇచ్చే అవకాశం ఉంది.

అంతే కాకుండా ఇలాంటి వారంతా ఈ డోసును ప్రైవేటు టీకా కేంద్రాల్లో, చెల్లింపు విధానంలో తీసుకునే విషయమై కూడా చర్యలు జరుగుతున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం దేశంలో ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ 60 ఏళ్ల పైబడిన వారికి ముందు జాగ్రత్త డోసు అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే అంతర్జాతీయ విమాన సర్వీసులు ఆదివారం నుంచి పునః ప్రారంభిస్తుండగా.. కొన్ని దేశాల్లో మూడో డోసు నిబంధన కూడా అమల్లో ఉంది.

అయితే ఈ ప్రభావం భారతీయ ప్రయాణికులకు ఎలాంటి ప్రభావం చూపుతుందన్న విషయమై విదేశీ వ్యవహారాల శాఖ ఇటీవల అప్రమత్తం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు వివిధ అవసరాల నిమిత్తం విదేశాలకు వెళ్లే యోచనలో ఉన్న వారంతా తమకు మూడో డోసును అందించాలన్న విజ్ఞాపనలు కూడా కేంద్ర, వైద్య, ఆరోగ్య శాఖకు అందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అలాంటి వారికి ముందు జాగ్రత్త డోసు వేసే విషయాన్ని ఈ శాఖ పరిశీలినస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

అయితే దీనంతటికి కారణం ఆదివారం నుంచి అంతర్జాతీయ విమాన యానం మునుపటి రీతిలోనే పునరుద్ధరణ జరుగుతున్నందున అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని విదేశీ ప్రయాణాలకు వెళ్లే భారతీయుల విషయంలో ఇప్పుడు సరికొత్త నిర్ణయానికి వచ్చారు. థర్డ్ డోస్ లేకుండా కొన్ని నిర్ణీత దేశాలకు వెళ్లడం వల్ల వైరస్ సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పటి వరకూ విదేశీ యానాలకు సరైన అవకాశాలు లేవు. కానీ ఇప్పుడు అంతకు ముందటి లాగానే అంతర్జాతీయ విమాన ప్రయాణాలు ప్రారంభం అవుతున్నందున బూస్టర్ డోస్ ప్రాధాన్యత పెరిగింది.

కీలక విషయాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిగణలోకి తీసుకుంది. బూస్టర్ లేదా నివారణ డోస్ ల విషయంలో అనుమతికి తుది నిర్ణయం దశకు వచ్చిందని వెల్లడైంది. అయితే ఇంత వరకూ అధికారిక ప్రకటన వెలువడలేదు. పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని సత్వర రీతిలోనే ఈ విషయంపై నిర్ణయాన్ని అధికారికంగా వెలువరిస్తారు. అయితే ఇప్పడిప్పుడే కరోనా తగ్గుతుంది అనుకుంటుండగా... మళ్లీ ఫ్రాన్స్, ఇటలీ, యూకే తో పాటు యూరప్ లోని మరిన్ని దేశాల్లో కరోనా నాలుగో వేవ్ వేగంగా వ్యాపిస్తుంది.

అందుకే భారత దేశ ప్రభుత్వం బూస్టర్ డోస్ వేయాలని నిర్ణయించుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా గత కొన్ని రోజులుగా చైనా, హాంకాంగ్ లలో కొవిడ్ కేసుల సంఖ్య అమాంతం గా పెరగగా, ప్రస్తుతం అవి తగ్గుముఖం పడుతున్నాయి. ఒమిక్రాన్ బీఏ.2 వేరియంట్ కారణంగా ప్రపంచ దేశాల్లో కరోనా మరో సారి వింభిస్తోంది.