Begin typing your search above and press return to search.

జగన్ హాట్ కామెంట్స్ తో టీడీపీకి బూస్టింగ్...?

By:  Tupaki Desk   |   9 April 2022 1:30 PM GMT
జగన్ హాట్ కామెంట్స్ తో టీడీపీకి బూస్టింగ్...?
X
రాజకీయాల్లో అన్నీ లెక్కలే. అలాగే మాటలు కూడా ఆచీ తూచీ వాడాలి. ప్రతీ మాట మెదడులో నుంచి వస్తుంది. అది అవతల వారి గురించి పూర్తిగా తెలియచేస్తుంది. ఇక జగన్ యాధాలాపంగా అని ఉండరు, అలాగని ఏ వ్యూహం లేకుండా అసలు మాట్లాడరు, కానీ జగన్ వరసబెట్టి రెండు రోజుల పాటు రెండు జిల్లాల్లో బహిరంగ సభల్లో చేసిన ప్రసంగాలు ఒక ఎత్తు అయితే విపక్షాల మీద చేసిన మాటల దాడులు మరో ఎత్తు.

జగన్ విపక్షాల మీద ఫుల్ గా ఫోకస్ పెట్టి గట్టిగానే మాట్లాడారు, ఒక విధంగా జగన్ స్ట్రాంగ్ డోస్ ఇన్నాళ్ల విపక్షల విమర్శలకు ఇచ్చారని సొంత పార్టీలో చర్చగా ఉండగా విశ్లేషణలు మాత్రం మరో రకంగా ఉన్నాయి. జగన్ లో ఫ్రస్ట్రేషన్ కట్టలు తెంచుకుందని, అందుకే ఆయన నోటి వెంట అలాంటి మాటలు వస్తున్నాయని విపక్షాలు కనిపెట్టేశాయి.

అందుకే టీడీపీలో చినబాబు నుంచి మొదలుపెడితే జనసేన పవన్ కళ్యాణ్ దాకా అంతా తమదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. ముందుగా చినబాబు విషయం చూస్తే జగన్ లో ఫస్ట్రేషన్ తన్నుకుని వస్తోందని అన్నారు. ఆయన గల్లీ నుంచి ఢిల్లీ దాకా అన్ని విధాలుగా ఫెయిల్ అయ్యారని, అందుకే ఈ అసహనం అంటున్నారు లోకేష్ బాబు.

ఇక పవన్ కళ్యాణ్ తీసుకుంటే మేము ప్రజా సమస్యలు ప్రస్థావిస్తూంటే వైసీపీ అగ్ర నేతలు వ్యక్తిగత దాడులు చేయడం సబబా అని నిలదీశారు. అదే వారు కోరుకుంటే తాము కూడా అలాగే మాట్లాడగలమని కూడా గట్టి రిటార్ట్ ఇచ్చారు. ఇక లేటెస్ట్ గా టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ మూడేళ్ల తరువాత ఒక్కసారిగా బయటకు వచ్చిన జగన్ కి వాస్తవాలు కళ్ల ముందు కనిపిస్తున్నాయని, ఊహలకు నిజాలకు మధ్య తేడాను చూడడంతోనే ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసేలా అసహనం కనిపిస్తోందని అంటున్నారు.

మొత్తానికి జగన్ తాను టీడీపీ ఇతర విపక్షాల మీద స్ట్రాంగ్ డోస్ పెంచానని అనుకోవచ్చు. అందులో వ్యూహాలు ఉండవచ్చు కానీ టీడీపీకి మాత్రం తమ బలం పెరిగిందని, వైసీపీ గ్రాఫ్ పడిపోతోందని, అందుకే జగన్ కి ఏం చేయాలో తెలియక ఇలా మాట్లాడుతున్నారని భావిస్తోంది.

ఇక రాజకీయ విశ్లేషణలు చూసినా అసహనం ఎవరికైనా ఎందుకు వస్తుంది తాము అనుకున్నది జరగకపోతేనే. ఇక తమకు అందుబాటులో ఉన్న నివేదికలు కూడా అనుకూలంగా రాకపోతే కూడా రియాక్షన్ వేరేగా ఉంటుంది. గతంలో చాలా మంది రాజకీయ నాయకులు తమ అసహనాన్ని దాచుకోలేక బయటపెట్టుకున్నారు. ఇపుడు అలాంటి పొలిటికల్ పారామీటర్లను చూసుకుని జగన్ కామెంట్స్ ని లెక్క తీస్తే మాత్రం ఆయన వత్తిడిలో ఉన్నారనే అంతా అంటున్నారు.

మొత్తానికి జగన్ హాట్ కామెంట్స్ తో టీడీపీకి ఫుల్ బూస్టప్ ఇచ్చేశారు. ఇన్నాళ్ళూ తాము ఎంత ఆందోళన చేస్తున్నా అధికార పార్టీ బలంగా ఉందని ఎక్కడో అనుమానాలు ఉండేవి. ఇపుడు జగన్ మాటలు, ఫస్ట్రేషన్ చూశాక పరిస్థితి అంతా తమకే ఫేవర్ గా ఉందని టీడీపీ పెద్దలు తమదైన వ్యూహలతో ఆలోచించి మురిసినా తప్పు లేదుగా.