Begin typing your search above and press return to search.
సరిహద్దు ఘర్షణ.. బయటపెట్టిన ఉపగ్రహ చిత్రాలు
By: Tupaki Desk | 18 Jun 2020 8:10 AM GMTభారత్-చైనా సైన్యాల మధ్య సరిహద్దుల్లో చోటుచేసుకున్న ఘర్షణలో ఇరు దేశాల సైనికులు ప్రాణాలు కోల్పోయారు. సరిహద్దుల్లోని గాల్వన్ లోయ వద్ద చోటుచేసుకున్న ఈ ఘర్షణ తాలూకా ఉపగ్రహ చిత్రాలు తాజాగా బయటపెట్టారు. వాస్తవాధీన రేఖ నుంచి కొద్దీ కిలోమీటర్ల దూరంలోని 14వ నెంబర్ పెట్రోలింగ్ పాయింట్ వద్ద ఈ ఘర్షణ చోటుచేసుకున్నట్టు తేలింది.
వాస్తవాధీన రేఖ వద్ద చైనా వైపు భారీగా బలగాలను మోహరించినట్టు శాటిలైట్ చిత్రాలను బట్టి తెలుస్తోంది . ఈ ప్రాంతం నుంచే చైనా దళాలు గాల్వన్ లోయలోని భారత భూభాగంలోకి చేరుకున్నట్టు తేలింది. 15000 అడుగుల ఎత్తులో వందలాది మంది సైనికులు సోమవారం ఘర్షణ పడ్డారు. భారత సైనికులపై ఇనుప రాడ్లు, ఇనుప తీగలతో చుట్టిన కర్రలతో దాడి చేయగా.. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఈ ఘర్షణ జరిగినట్టు తెలిసింది.
సైనికులు ఎత్తైన శిఖరం నుంచి కిందన ఉన్న గాల్వన్ నదిలోకి దూకినట్టు ఉపగ్రహ చిత్రాలు తెలియజేస్తున్నాయి. చైనా అంబులెన్స్ లు ఈ ప్రాంతంలో మృతదేహాలను.. గాయపడిన సైనికులను తీసుకెళ్లడాన్ని భారతసైనికులు గమనించారు. హెలిక్యాప్టర్లలో కూడా తీసుకెళ్లారు.
ఇక భారత దళాలు కూడా అక్కడ ఉన్నట్టు ఉపగ్రహ చిత్రాల ద్వారా తేలింది. పట్టుకోల్పోకుండా కాపలా కాసినట్టు స్పష్టమవుతోంది. మారణహోమం జరిగిన 24 గంటల్లో తీసిన హైరెజల్యూషన్ ఉపగ్రహ చిత్రాల్లో భారత్ కన్నా చైనా దళాలు భారీ సంఖ్యలో మోహరించినట్లు అర్థమవుతోంది. 200 మందికి పైగా సైనిక వాహనాలు, చెక్ పోస్టులు ఉన్నట్టు కనిపిస్తోంది. దీన్ని చైనా బలగాల ఉపసంహరణను ఉల్లంఘించిందని స్పష్టమైంది.