Begin typing your search above and press return to search.

పాక్ సరిహద్దుల్లో అలజడి.. ఆయుధాలతో కూడిన భారీ బ్యాగ్ లభ్యం !

By:  Tupaki Desk   |   12 Sep 2020 4:30 PM GMT
పాక్ సరిహద్దుల్లో అలజడి..  ఆయుధాలతో కూడిన భారీ  బ్యాగ్ లభ్యం !
X
ఈ మద్యే పంజాబ్ వద్ద పాకిస్థాన్ సరిహద్దుల్లో ఆయుధాలతో దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఐదుగురిని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దళాలు హతమార్చిన విషయం తెలిసిందే. తాజాగా, పాక్ సరిహద్దుల్లో ఆయుధాలు, పేలుడు పదార్థాలను బీఎస్ ఎఫ్ స్వాధీనం చేసుకుంది. పంజాబ్‌ ఫిరోజ్‌పూర్ జిల్లాలోని భారత్-పాక్ సరిహద్దుల్లో మూడు ఏకే-47 తుపాకులు, రెండు ఎం-16 రైఫిల్స్‌ ను శనివారం స్వాధీనం చేసుకున్నట్టు బీఎస్ ఎఫ్ అధికారులు తెలిపారు.

ఉదయం 7.00 గంటల ప్రాంతంలో సరిహద్దుల వద్ద సోదాలు నిర్వహిస్తున్న సమయంలో ఈ ఆయుధాలతో కూడిన బ్యాగును గుర్తించారని వెల్లడించారు. ఆరు మ్యాగిజైన్స్ ‌తో కూడిన ఏకే 47- 91 రౌండ్లు, నాలుగు మ్యాగిజైన్స్‌ తో కూడిన ఎం 16 రైఫిల్స్ సహా 57 రౌండ్లు, రెండు పిస్టల్స్, 20 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. పాకిస్థాన్ నుంచి దేశంలోకి అక్రమంగా ఈ ఆయుధాలను తరలిస్తున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఫిరోజ్‌పూర్ జిల్లా అబోహర్ అంతర్జాతీయ సరిహద్దుల నుంచి దేశంలోకి పాక్ ఉగ్రవాదులు చేరవేయడానికి ప్రయత్నిస్తున్నట్టు భావిస్తున్నారు.

మరోవైపు, జమ్మూ-కశ్మీర్‌లోని సరిహద్దుల్లో పాక్ సైన్యం కాల్పులకు తెగబడుతోంది. పూంచ్‌ జిల్లా మనోకోట్‌ సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి గురువారం రాత్రి నుంచి మోర్టార్లతో దాడిచేస్తోంది. పాకిస్థాన్ దుశ్చర్యలను భారత బలగాలు అంతే రీతిలో తిప్పికొడుతున్నాయి. అలాగే, మందుపాతర పేలి ఓ సైనిక ఉన్నతాధికారి సహా ఇద్దరు తీవ్రంగా గాయపడిన ఘటన జమ్మూ-కశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో శుక్రవారం చోటు చేసుకుంది. కాగా, బద్గాం జిల్లాలో నాలుగు రోజుల కిందట జరిగిన ఎన్ ‌కౌంటర్ ‌లో గాయపడిన జైషే మహమ్మద్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన తీవ్రవాది మృతదేహాన్ని భద్రతా దళాలు శుక్రవారం స్వాధీనం చేసుకున్నాయి. ‘ఎన్‌ కౌంటర్ ‌లో గాయపడిన ఉగ్రవాదులు ఓ నదిలో దూకారు. నౌకాదళ అధికారుల సహాయంతో పోలీసులు, సైనికాధికారులు నాలుగు రోజులపాటు వారి కోసం గాలించి ఓ మిలిటెంట్‌ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొన్నారు’ అని పోలీసు అధికారి తెలిపారు.