Begin typing your search above and press return to search.

థ్యాంక్స్ టు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం: లాక్‌ డౌన్ ఎత్తేసినా ఇంట్లో ప‌నికే ఓకే

By:  Tupaki Desk   |   3 May 2020 5:30 PM GMT
థ్యాంక్స్ టు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం: లాక్‌ డౌన్ ఎత్తేసినా ఇంట్లో ప‌నికే ఓకే
X
బ‌య‌ట ట్రాఫిక్ జామ్‌.. పొద్దున వెళ్లామంటే రాత్రికి ఇంటికి రావ‌డం.. దీంతో అస‌లు ఇంటికి స్నానం చేయ‌డం - తిన‌డం - నిద్ర‌పోవ‌డానికి మాత్ర‌మే ఇల్లు ఉంద‌ని అనిపించేంది. దీంతో కొంద‌రికీ అదొక హాస్ట‌ల్ మాదిరిగా క‌నిపించేది. ఇప్పుడేమో బ‌య‌టకు అడుగుపెట్ట‌కుండానే ఇంట్లో ఉండే విధులు నిర్వ‌హిస్తూ ఎంచ‌క్కా బ్యాంక్ బ్యాలెన్స్ నింపేసుకుంటున్నారు. లాక్‌ డౌన్ పుణ్యాన ఇంటి నుంచే ప‌ని చేస్తూ చాలా మంది ఉద్యోగులు ఆర్జిస్తున్నారు. ఇప్పుడు డైనింగ్ టేబులే ఆఫీస్ టేబులైంది.. ఇళ్లే కార్యాల‌య‌మైంది.. ఇష్టమొచ్చిన స‌మ‌యంలో ప‌ని చేసుకునే వీలు చిక్కింది. దీంతో ఉద్యోగులు హ్యాపీగా ప‌నులు చేసుకుంటున్నారు. లాక్‌ డౌన్ నేప‌థ్యంలో ఇచ్చిన అవ‌కాశాన్ని చ‌క్క‌గా వినియోగించుకుంటున్నారు. దీంతో చాలామంది ఉద్యోగులు వ‌ర్క్ ఫ్ర‌మ్ విధానానికి థ్యాంక్స్ చెప్పేస్తున్నారు. ప్ర‌స్తుతం క‌రోనా తీవ్రత ఇంకా త‌గ్గ‌క‌పోవ‌డంతో కంపెనీలు వ‌ర్క్‌ ఫ్రం హోమ్‌ ను జూలై వరకు పొడిగించాయి. దీంతో ఇప్పుడు ఉద్యోగులంతా వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం విధానం వైపు మొగ్గుచూపుతున్నారు. ఇదే విష‌యాన్ని ఫోర్బ్స్ వెల్ల‌డిస్తోంది. వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ విధానంపై ఆ సంస్థ స‌ర్వే చేసి నివేదిక విడుద‌ల చేసింది.

వాస్త‌వంగా వర్క్‌ ఫ్రం హోమ్ విధానాన్ని సాంకేతిక భాష‌లో రిమోట్‌ వర్కింగ్‌ సిస్టమ్‌ గా పేర్కొంటారు. వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం ప‌ని ప‌ని చేసే వారిని రిమోట్‌ వర్కర్స్ అంటారు. ఈ స‌ర్వేలో ఆఫీస్‌ లో ఉండి పనిచేసేవారి కంటే సమర్థవంతంగా, సంతోషంగా వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం పనిచేసే వారే విధులు నిర్వ‌హిస్తున్న‌ట్లు తేలింది. దాదాపు 2 లక్షల మందిని తీసుకుని సర్వే చేయ‌గా ఈ విష‌యం తెలిసింద‌ని ప్ర‌క‌టించింది. ఆఫీసులో కూర్చుని పని చేస్తున్న వారితో పోలిస్తే సంతోషపు స్థాయి కూడా వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం చేస్తున్న వారిలోనే అధికంగా ఉందంటం. వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం ఉద్యోగుల సంతోషపు స్థాయి సగటు 10కి 8.10 ఉంటే - మిగిలిన మార్గాల్లో పనిచేస్తున్న వారి సంతోష‌పు స్థాయి 7.42 ఉందట. ఆఫీసులో ఉండి చేసే పనికన్నా అధికంగా ఇంట్లో ఉండే ప‌ని చేస్తున్న‌ట్లు పని చేయగలుగుతున్నట్లు ఇంట్లో ఉండి ప‌ని చేసేవాళ్లు చెబుతున్నారు.

దీనికి గ‌ల కార‌ణాలు చెబుతున్నారు. నగరాల్లో ఇంటి నుంచి ఆఫీసుకు మధ్య రాకపోకలకు అయ్యే సమయం మిగులుతోంది అని ప్ర‌ధానంగా చెబుతున్న మాట‌. దాంతో స‌మ‌యం క‌లిసొస్తోంద‌ని అంటున్నారు. ఇక ఆఫీస్‌ లో ఉంటే ఎప్పుడు బాస్ అజమాయిషీతో ప‌ని చేయాల్సి వ‌చ్చేది. ఆఫీస్‌ లో స్వేచ్ఛ‌గా ప‌ని చేసుకునే వారు కాదు. ఇప్పుడు అలాంటివేమీ లేవు. స్వేచ్ఛగా ఇంట్లో ఎంతో ఇష్టంతో ప‌ని చేస్తున్న‌ట్లు వ‌ర్క్ ఫ్ర‌మ్ చేసేవారు తెలిపారు. ఆఫీసులో ఎంత ప‌ని చేసినా కొంద‌రు తొక్కి వేసి మంచిగా ప‌ని చేస్తే అది వారి గొప్ప‌గా వారి ఖాతాలో వేసుకుంటారు. దీని నుంచి విముక్తి పొందారు.

వీట‌న్నిటి నేప‌థ్యంలో అంద‌రి ఓటు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌ కే ఉంది. ఇంటి నుంచి ప‌ని చేసే వారి ప‌నితీరు బాగుంద‌ని కూడా యాజ‌మాన్యాలు చెబుతున్నాయి. భ‌విష్య‌త్‌ లో ఈ విధానం కొన‌సాగే అవ‌కాశం ఉంద‌ని కార్పొరేట్ వ‌ర్గాలు చెబుతున్నాయి.