Begin typing your search above and press return to search.
మొహమాటాలు లేవు : మాటల తూటాలేనా ?
By: Tupaki Desk | 7 Jun 2022 1:30 AM GMTఉత్తరాంధ్రా జిల్లాల రాజకీయ నాయకులలో పైకి తెలియని ఏదో ఒక అవగాహన ఉందని అంతా అనుకుంటారు. ఇక్కడ ఎవరి పార్టీ ఏదైనా ఎవరి ఆట ఎలా ఉన్నా ఎదుటి పార్టీ నేతలను మరీ వ్యక్తిగతంగా పోయి విమర్శలు చేసుకోరు. అది రాజకీయ నీతిగానో రాజనీతిగానో చాలా కాలంగా చలామణీ అయిపోతోంది. అలాంటి సంప్రదాయానికి ఇపుడు తూట్లు పడుతున్నాయి. మాటల తూటాలూ అటూ ఇటూ పేలుతున్నాయి.
ఉత్తరాంధ్రా జిల్లాలలో సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు. ముందుగా బొత్స సత్యనారాయణ గురించి చెప్పుకోవాలీ అంటే ఆయనది మూడున్నర దశాబ్దాల రాజకీయం. విజయనగరాన జిల్లా కోపరేటివ్ బ్యాంక్ నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం మొదలై ఇపుడు రాష్ట్ర స్థాయి నేతగా మారింది. బొత్స తూర్పు కాపు, పైగా బీసీ. దాంతో ఆయన అటు కాపులకూ ఇటు బీసీలకు ఉత్తరాంధ్రా జిల్లాల ప్రతినిధిగా బలమైన వాయిస్ గా ఉంటున్నారు.
ఇక ఆయన టీడీపీలో చంద్రబాబును టార్గెట్ చేస్తారు తప్ప లోకల్ గా ఉన్న వారిని పెద్దగా ఏమీ అసలు అనరు. అంతదాకా ఎందుకు విజయనగరంలో తనకు టీడీపీ నుంచి గట్టి ప్రత్యర్ధిగా ఉన్నా కూడా ఏనాడూ అశోక్ గజపతిరాజు మీద మాట తూలలేదు. అలాంటిది వైసీపీలోకి వెళ్లాక బొత్స తీరు మారింది. ఆ మధ్యన ఆయన అశోక్ మీద నేరుగానే కామెంట్స్ చేశారు. మీ రాచరికాలు అసలు చెల్లవంటూ గట్టిగానే మాట్లాడారు.
ఇక ఇపుడు చూస్తే ఏపీ టీడీపీ పెద్ద అచ్చెన్నాయుడు మీద పెద్ద నోరు చేశారు. అచ్చెన్నకు మెదడు పనిచేయడంలేదని వ్యక్తిగతంగానే టార్గెట్ చేశారు. ఇక ఆయన గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు వంటి వారి మీదనే గురి పెట్టాల్సి ఉంది. అయితే గంటా నేను రెడీ అంటూ ముందుగానే బొత్స మీద విమర్శలు చేశారు. చేతగాని మంత్రి అన్నట్లుగా మాట్లాడేశారు. ఆ విధంగా బొత్సతో డైరెక్ట్ ఫైట్ అని సంకేతాలు పంపారు.
ఇక అచ్చెన్నాయుడు మీద బొత్స కామెంట్స్ చేయడానికి ముందే అచ్చెన్న బొత్స మీద మద్యం వ్యాపారీ అంటూ ఆయన పరువు తీసేలా మాట్లాడారు, విద్యా శాఖను ఒక మద్యం వ్యాపారి చేతులో పెట్టిన ప్రభుత్వం ఇదని అచ్చెన్న అన్న మాటలకే ఇపుడు బొత్స వారు రిటార్ట్ ఇచ్చారు అనుకోవాలి. ముందు ముందు ఈ వ్యక్తిగత దూషణలు ఏ స్థాయిలోకి వెళ్తాయో తెలియదు. మొత్తం మీద తమ పార్టీల అధినాయకత్వాలు దూకుడు చేయమంటున్నాయి. దానికి తగినట్లుగా ఇప్పటిదాకా పాటిస్తున్న సహనం కాస్తా నీరుకారి ఇపుడు నోరు జారుతున్నారు అంటున్నారు.