Begin typing your search above and press return to search.

బాబు బ్యాచ్ కు మాట రాని రీతిలో బొత్స సవాల్

By:  Tupaki Desk   |   19 Nov 2019 5:32 AM GMT
బాబు బ్యాచ్ కు మాట రాని రీతిలో బొత్స సవాల్
X
మంత్రి బొత్స మాంచి మాటకారి. కాకుంటే హడావుడిగా మాట్లాడినట్లు కనిపిస్తారు కానీ చాలా తెలివైనోడు. తన మాటలతో రాజకీయ ప్రత్యర్థుల్ని ఇరుకున పెట్టేలా మాట్లాడటంలో ఆయనకు ఆయనే సాటి. విన్నంతనే అర్థం కాకున్నా.. కాస్త ఆలోచించి చూసినప్పుడు బొత్స మాటల్లోని లోతు కనిపిస్తుంది.

కొన్నిసార్లు ఆయన మాటలు యమా చురుగ్గా.. సూదుల్లా గుచ్చేటట్లు ఉంటాయి. మరికొన్నిసార్లు చాలా సింఫుల్ గా అనిపిస్తాయి. పస లేనట్లుగా ఉంటాయి. కానీ.. వాటికి సమాధానం చెప్పాలంటే మాత్రం కిందామీదా పడాల్సిందే. అదే బొత్స మాస్టారి టాలెంట్. ప్రత్యర్థుల వ్యూహాలకు తగినట్లుగా ఎదురుదాడి చేయాలన్ని కనీస విషయాన్ని మర్చిపోయే బాబు బ్యాచ్.. తమకు తోచినట్లుగా అడ్డ బ్యాటింగ్ చేసినట్లుగా మాట్లాడేస్తుంటారు.

ఇలాంటివేళలోనే బొత్స తన టాలెంట్ ఎంతన్నది ప్రదర్శిస్తారు. తాజాగా సర్కారీ స్కూళ్లలో ఇంగ్లిషు మీడియంలో బోధన అంశం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఎపిసోడ్ లో పేద వర్గాలకు మేలు చేయాలన్నదే ప్రభుత్వ ఆలోచనగా ఉంటుంది. అయితే.. ఇలాంటి పథకాలు అమల్లోకి వస్తే.. తమ పీఠాలు శాశ్వితంగా లేచిపోతాయన్న భయం బాబు పరివారానికి పట్టేసింది.

దీంతో పస లేని వాదనను తెర మీదకు తీసుకొచ్చారు. మాతృభాష మీద టన్నుల కొద్దీ ప్రేమాభిమానాల్ని కురిపించేస్తున్నారు. మరింత అభిమానం ఉన్న చంద్రబాబు పరివారం తమ ఐదేళ్ల పాలనలో కానీ.. అంతకుముందు తొమ్మిదిన్నరేళ్ల పాలనలో కానీ తెలుగు ప్రజలకు చేసిందేమైనా ఉందా? అంటే లేదనే చెప్పాలి. తాను చేయని పనిని.. ఎదుటోళ్లు చేయాలని తపించటంలో అర్థముందా? అన్నది ఒక ప్రశ్న.

ఈ కారణంగానే ఇంగ్లీషు మీడియంలో బోధనపై బాబు పరివారం ఎంతగా చించుకున్నా.. తెలుగు ప్రజల్లో స్పందన అంతంత మాత్రంగానే అనిపించే పరిస్థితి. తాము చేస్తున్న ప్రయత్నాలకు మతమార్పిళ్ల ముసుగు వేస్తూ చేస్తున్న దుష్ప్రచారానికి చెక్ పెట్టేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు రంగంలోకి దిగుతున్నారు.

తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సర్కారీ స్కూళ్లలో ఇంగ్లిషు మీడియం ప్రవేశ పెడుతుంటే.. బాబు దాన్ని వక్రీకరిస్తున్నారన్నారు. మీకు దమ్ముంటే.. ఇంగ్లిషుకు మీరు వ్యతిరేకమని ప్రకటించగలరా? అని ప్రశ్నించారు. మాతృభాషను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతుందో.. మనిషి మనుగడకు.. బతికేందుకు ఇంగ్లిషు అంతే అవసరమన్న విషయాన్ని ఆయన చెప్పారు. బొత్స మాటల్ని చూసినప్పుడు.. బాబు బ్యాచ్ కు మింగుడుపడలేని రీతిలో ఉండటమే కాదు.. సమాధానం చెప్పలేక కిందామీదా పడే పరిస్థితి ఉందంటున్నారు.