Begin typing your search above and press return to search.
బాబు అమెరికా పర్యటన గుట్టు త్వరలో తేలుతుందట
By: Tupaki Desk | 8 May 2017 11:41 AM GMTఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటన, మీడియాలో దుష్ప్రచారం, టీడీపీ నేతల కామెంట్లపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఘాటుగా స్పందించారు. చంద్రబాబు తన అమెరికా పర్యటన అట్టర్ ఫ్లాప్ కావడంతో దాన్ని డైవర్ట్ చేసేందుకు ప్రజలను మభ్యపెడుతూ మెగా షో లా సృష్టిస్తూ వైసీపీపై బురదజల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాలోని ఇర్వింగ్ పోలీసులకు వైసీపీ ఈమెయిల్స్ పంపిందంటూ , టీడీపీ అనుకూల మీడియా చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. రామజపం లాగా ఎప్పుడూ వైసీపీ, వైఎస్ జగన్ పేరు తప్ప టీడీపీ నేతలకు ఇంకో పనేలేదని మండిపడ్డారు. ``మీమీద మెయిల్స్ పంపించాల్సిన అవసరం ఏమొచ్చింది? మీ జోడి ప్రభుత్వం కేంద్రంలో ఉంది కదా? విచారణలు అడ్డుకోగలిగే వ్యూహకర్తవు కదా?`` అని బాబుపై బొత్స ధ్వజమెత్తారు. ఆడలేక మధ్యలో ఓడదరువు అన్నట్టు బాబు రాష్ట్రానికి ఏమీ చేయలేక వైఎస్సార్సీపీని ఆడిపోసుకోవడం సిగ్గుచేటన్నారు.
మాజీ ఎమ్మెల్యే బి. నారాయణరెడ్డిని చూసేందుకు వైఎస్ జగన్ అనంతపురం జిల్లాకు వెళితే..జగన్- ఎంపీ విజయసాయిరెడ్డి అమెరికా ఇష్యూపై సీరియస్ గా డిస్కషన్ చేస్తున్నారంటూ ఓ చానల్ లో బ్రేకింగ్ రావడం హాస్యాస్పదంగా ఉందని బొత్స అన్నారు. వైసీపీకి టీడీపీ లాగా ఇతరుల వ్యవహారాలపై దృష్టిసారించడం కంటే రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, రైతుల కష్టాలపైనే దృష్టి సారిస్తుందని తెలుసుకోవాలని ప్రభుత్వానికి హితవు పలికారు. తాగడానికి నీళ్లు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని, ఖరీఫ్ లో 20 పంటలు పండింతే ఒక్కదానికి కూడ గిట్టుబాటు ధర లేదని మండిపడ్డారు. మిరప రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని వాపోయారు. రాష్ట్రంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటే వారిని గాలికొదిలేసి బాబు విదేశాల్లో డ్రామాలాడుతున్నాడని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు అమెరికా నుంచి పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్లారో, లేక అక్కడ పెట్టుబడులు పెట్టడానికి వెళ్లారో త్వరలోనే తెలుస్తుందని బొత్స అన్నారు. బాబు అక్కడ ప్రజాధనాన్ని ఏవిధంగా దుర్వినియోగం చేస్తున్నారో, ఆయన అనుచరులు అక్కడ జిందాబాద్ లు ఏవిధంగా కొడుతున్నారో తమకు అన్నీ తెలుసునన్నారు. మూడేళ్లలో 15దేశాలు తిరిగిన చంద్రబాబు ఏమేరకు పెట్టుబడులు తీసుకొచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. బాబు పర్యటనల వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని, శుద్ధ దండగని తెలిసిందేనని అన్నారు. జపాన్, మలేషియా, సింగపూర్, దుబాయి, కొలంబో ఎక్కడకు వెళ్తే అక్కడి పరిజ్ఞానాన్ని అమరావతికి తీసుకొస్తానంటూ బాబు మాట్లాడడం విడ్డూరమన్నారు. రాష్ట్రంలో అనుకూల పరిస్థితులు ఉంటేనే ఎవరైనా పరిశ్రమలు పెట్టేందుకు ముందుకొస్తారు తప్ప...బాబు, లోకేష్ ల ముఖం చూసి కాదని ఎధ్దేవా చేశారు. రాష్ట్రంలో ఎవరైనా పరిశ్రమలు పెట్టడానికి వస్తే చినబాబు మా వాటా ఎంత అని అడుగుతున్నారని మండిపడ్డారు. ఇలా లంచాలు, కమీషన్లు అడుగుతుంటే రాష్ట్రానికి పరిశ్రమలు ఎలా వస్తాయని నిలదీశారు.
దేశం మొత్తం మీద అవినీతిలో ఏపీ నంబర్ వన్ అని అనేక సంస్థలు చెబుతున్నాయని బొత్స అన్నారు. కాకినాడలో సెల్ కంపెనీ ఎందుకు వెనక్కి వెళ్లిపోయిందో బాబు సమాధానం చెప్పాలన్నారు. అమెరికా వెళ్లాక ఏవిధమైన ప్రయోజనం జరగదని తెలిసే బాబు లోకేష్ ను అమెరికా టూర్ లోంచి డ్రాప్ చేశాడని విమర్శించారు. ఇద్దరూ వెళితే బద్నామైపోతారన్న ఉద్దేశ్యంతోనే లోకేష్ వెళ్లలేదన్నారు. దీనిపై బాబు ప్రజలకు వివరణ ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు.