Begin typing your search above and press return to search.
అమరావతి.. హైమావతి.. బొత్స వ్యాఖ్యలు ఏం చెబుతున్నాయ్?
By: Tupaki Desk | 24 Oct 2019 6:38 AM GMTఏపీ రాజధాని అమరావతిపై మొదట్నించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసే ఏపీ మంత్రి బొత్స సత్యానారాయణ తాజాగా మరోసారి ఫుల్ క్లారిటీ వచ్చేలా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అది అమరావతి కావొచ్చు.. హైమావతి కావొచ్చు.. రాజధాని నగరం ఎక్కడ నిర్మించాలన్న విషయాన్ని తమ ప్రభుత్వం నియమించే కమిటి లెక్క తేలుస్తుందని చెప్పటం ద్వారా.. రాజధాని అమరావతి కొనసాగే అవకాశం లేదని స్పష్టం చేశారని చెప్పాలి.
అమరావతి కోసం రైతులు 33వేల ఎకరాలు ఇచ్చారని బాబు గొప్పలు చెప్పుకుంటున్నారని.. రాజధాని నగరం కోసం ఏకంగా లక్ష ఎకరాలు ఇచ్చేందుకుసైతం సిద్ధంగా ఉన్నారనే వ్యాఖ్యతో బొత్స క్లారిటీ ఇచ్చేశారని చెప్పాలి. తన పాలనలో వేలాది కోట్లు అప్పులు చేసిన చంద్రబాబు.. అమరావతిలో ఒక్కటంటే ఒక్క శాశ్విత భవనాన్ని ఎందుకు నిర్మించలేదన్న ప్రశ్న ఆలోచించతగినదే.
స్టార్టప్ ఏరియా నుంచి సింగపూర్ కన్సార్టియం తప్పుకుంటానని తనకు తాను చెప్పిందని.. అమరావతిలో ఇప్పటివరకూ నిర్మించిన ప్రతి కట్టటం నిబంధనలకు విరుద్ధంగానే ఉందంటూ పీటర్ కమిటి నిర్థారణ చేసినట్లుగా వ్యాఖ్యలు చేయటం చూస్తే.. అమరావతి నుంచి పక్కకు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పక తప్పదు. అంతేకాదు.. ఉత్తమాటలే కాకుండా చేతల్లో కూడా అన్నట్లుగా రాజధాని నగరాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై ఇప్పటివరకూ జరిగిన పరిణామాల్ని సమీక్షించి సిఫార్సులు చేసేందుకు తాజాగా ఒక కమిటీని నియమించటం చూస్తే.. రాజధాని మార్పు దాదాపు ఖాయమన్న భావన కలుగక మానదు.
అమరావతిలో నిర్మాణ వ్యయం ఎక్కువని.. పునాదులకు కనీసం వంద అడుగులు తవ్వాల్సి వస్తుందని చెప్పిన బొత్స.. తాము ఏర్పాటు చేసిన కమిటీ ఆరు వారాల్లోనే నివేదిక ఇస్తుందని.. దేశంలోనే అత్యుత్తమ రాజధాని నగరాన్ని నిర్మిస్తామని చెప్పటం చూస్తే.. ఏపీ రాజధాని అమరావతి కాకుండా మరేదైనా నగరం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అమరావతిని రాష్ట్ర రాజధానిగా ఏర్పాటు చేయటంపై ఇప్పటికే పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. నిజానికి అమరావతి నిర్ణయం పూర్తిగా బాబు ఒక్కరే తీసుకున్నారన్న విమర్శ ఉంది. తన వర్గీయులకు.. సన్నిహితులకు.. తన బినామీలకు భారీ ఎత్తున భూమిని కట్టబెట్టేందుకే బాబు అమరావతిని ఎంపిక చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. వాటిని కూడా బొత్స మొహమాటం లేకుండా ప్రస్తావించటం చూస్తే.. అమరావతి స్టేటస్ మారే అవకాశం పుష్కలంగా కనిపిస్తున్నాయని చెప్పక తప్పదు.