Begin typing your search above and press return to search.

ఇగో లేనప్పుడు.. టీచర్ల ఆందోళనపై సానుకూలంగా రియాక్టు కావొచ్చుగా బొత్స

By:  Tupaki Desk   |   2 Sep 2022 5:33 AM GMT
ఇగో లేనప్పుడు.. టీచర్ల ఆందోళనపై సానుకూలంగా రియాక్టు కావొచ్చుగా బొత్స
X
ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో టీచర్లు వర్సెస్ జగన్ సర్కారు అన్న పరిస్థితి ఉంది. దీనికి కారణం లేకపోలేదు. తాను ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన వారం వ్యవధిలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం సమస్యను పరిష్కరిస్తానని చెప్పుకొచ్చారు.

సీపీసీ సమస్య పలు రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ.. మరే రాష్ట్రంలో లేనట్లుగా వైసీపీ అధినేత జగన్ మాత్రం.. తాము పవర్లోకి వచ్చినంతనే దాన్ని పరిష్కరిస్తామని.. మిగిలిన రాష్ట్రాలతో సంబంధం లేకుండా ఆ స్కీంను ఏపీలో అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటేస్తున్నా.. సీపీసీ ఇష్యూను మాత్రం పరిష్కరించకపోవటం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. ఏపీ ప్రభుత్వ ఉపాధ్యాయులతో.. వారి సంఘాలతో జగన్ సర్కారుకు మధ్యనున్న లొల్లిని తీర్చేందుకు వీలుగా భేటీ నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తాము పవర్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో విద్యా రంగాన్ని డెవలప్ చేసేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. 670 ఎంఈవో పోస్టుల భర్తీ చేయమని సీఎం చెప్పారని.. పాలనా సౌలభ్యం కోసం పెండింగ్ లో ఉన్న 248 మంది ప్రభుత్వ ఉపాధ్యాయుల సీనియార్టీ ఆధారంగా ఎంఈవోలను నియమిస్తామన్నారు.

ఇక.. ఏపీ ప్రభుత్వ ఉపాధ్యాయులు రగిలిపోయేలా చేస్తున్న.. ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ఆధారంగా హాజరు నమోదు చేయాలన్న జగన్ సర్కారు తీరుపై తీవ్ర స్థాయిలో మండిపాటు వ్యక్తమవుతోంది. తాజాగా తీసుకొచ్చిన ఈ విధానంలో 86 శాతం మంది టీచర్లు యాప్ లో అటెండెన్స్ నమోదు చేస్తున్నట్లు చెప్పారు. తమకు ఇగో లేదని.. ఉపాధ్యాయులకు.. విద్యార్థులకు మంచి చేయాలనే తపనే తమకుందన్నారు. తమది ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని.. ఏ సమస్య ఉన్నా తమ వరకు తీసుకొస్తే తప్పనిసరిగా పరిష్కరిస్తామన్నారు.

సమస్యల పరిష్కారానికి.. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం ఆందోళన చేస్తున్న టీచర్లపై జగన్ సర్కారు పెట్టిన కేసుల విషయాన్ని ముఖ్యమంత్రి ద్రష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. తాము ప్రవేశ పెట్టినవన్నీ ఎప్పటి నుంచో వస్తున్నవే తప్పించి.. కొత్తగా పెట్టింది లేదన్నారు.

మంత్రి బొత్స చెప్పినట్లుగా జగన్ ప్రభుత్వం ప్రెంఢ్లీ సర్కారే అయితే.. ఇన్నేసి ఆందోళనలు.. పాఠాలు చెప్పుకునే టీచర్లలో ఇంత భారీగా ఫస్ట్రేషన్ ఎందుకు ఉంటుంది? అన్న ప్రశ్నకు సమాధానం ఎప్పుడు చెబుతారో?


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.