Begin typing your search above and press return to search.
ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు టీచర్లకు లేదు: మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు
By: Tupaki Desk | 25 July 2022 11:31 AM GMTఏపీ మంత్రి బొత్స సత్య నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీచర్లు.. ప్రభుత్వంలో పనిచేస్తున్నార ని.. ప్రభుత్వం ఏం చెప్పినా.. చేయాల్సిందేనని..ప్రశ్నించడానికి వీల్లేదని అన్నారు.
అంతేకాదు.. ప్రభు త్వంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు.. వారి పిల్లలను ఎక్కడ చదివిస్తున్నారో.. ధైర్యంగా చెప్పమనండి అం టూ.. సవాల్ రువ్వారు. పాఠశాలలకు ఏం చేయాలో.. ఏం చేయకూడదో... ప్రభుత్వానికి అన్నీ తెలుసు నని అన్నారు.
ప్రభుత్వ విధానాన్ని వద్దనే అధికారం ఉపాధ్యాయులకు ఎక్కడిదని బొత్స ప్రశ్నించారు. ఉపాధ్యాయు లంతా ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లల్ని చదివిస్తున్నారా? అని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యతను పెంచేందుకే సంస్కరణలు చేపట్టామన్నారు.
రాష్ట్రంలో చేపట్టిన విద్యా సంస్కరణల యజ్ఞం ఫలితాలు వచ్చేందుకు సమయం పడుతుందని, సీబీఎస్ఈ, ఆంగ్ల మాధ్యమంలో బోధన, డిజిటల్ క్లాస్ రూమ్‌లు ఇలా వేర్వేరు అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు.
ఉపాధ్యాయులు చెబుతున్న వివిధ అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. ఉపాధ్యాయులు, ఉద్యో గులు ప్రభుత్వంలో అంతర్భాగమని, పాఠశాలల విలీనంపై విద్యార్దుల తల్లితండ్రులూ అభ్యంతరం చెప్పటం లేదన్నారు.
ఎవరో కుట్రలు చేస్తున్నారని, ఈ విధానాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5,600 పైచిలుకు పాఠశాలలు మ్యాపింగ్ చేస్తే కేవలం 268 పాఠశాలకు మాత్రమే దూరం అని భావిస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.