Begin typing your search above and press return to search.
బొత్స మార్క్ క్లాస్ : మాకు పాఠాలు చెప్పొద్దు గురూ ....?
By: Tupaki Desk | 25 July 2022 11:30 PM GMTఆయన విద్యా శాఖ మంత్రి. అంటే ఏపీకే పెద్ద మాస్టర్ అన్న మాట. ఆయనే అందరికీ పాఠాలు చెబుతారు, చెప్పాలి కూడా. ఎవరైనా చెబితే మాత్ర గుస్సా అవడం సహజమే కదా. సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ అందుకే ఫైర్ అవుతున్నారు. పాఠాళు చెప్పే పంతుళ్ళూ అవేవో మీరు బడులలో పాఠాలు చెప్పుకోండి. అంతే తప్ప సర్కార్ కి పాఠాలు చెప్పడమేంటి అని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలలను విలీనం చేస్తూ తీసుకువచ్చిన 117 ఉత్తర్వు ఏపీలో ఇపుడు మంట పుట్టిస్తోంది. అసలే సీపీఎస్ రద్దు చేయలేదని మంట మీద ఉన్న ఉపాధ్యాయులకు ఇది మరింత వేడెక్కించింది. ఇక కొద్ది నెలల క్రితం కొత్త పీయార్సీ విషయంలో కూడా ఉపాధ్యాయులే ప్రభుత్వం మీద విమర్శలు సంధించారు. నాడు ప్రభుత్వ ఉద్యోగులు సర్దుకున్నా ఉపాధ్యాయులు ఏ కోశానా ఊరుకోలేదు.
ఒక విధంగా అతి పెద్ద గ్యాప్ అయితే టీచర్లకు సర్కార్ కి మధ్య ఉంది అంటున్నారు. ఈ నేపధ్యంలో కొత్త విద్యా సంవత్సం మొదలవుతూనే మూడు, నాలుగు అయిదు పాఠశాలలను విలీనం చేయడం అంటే వారికి చిర్రెత్తుకుని వచ్చింది. ఆ విధంగా చాలా పాఠశాలలు కనుమరుగు అయ్యాయి. అదే విధంగా విలీనం చేసిన హైస్కూళ్ళు చాలా దూరంగా ఉన్నాయి.
దీంతో తల్లిదండ్రులు కూడా మండుతున్నారు. వారికి మద్దతుగా టీచర్లు రోడ్డు మీదకు వచ్చారు. వారు ఒక విధంగా సర్కార్ విధానాలను సవాల్ చేసేలా మాట్లాడుతున్నారు. దాంతో బొత్స ఫైర్ అవుతున్నారు. ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం ఏంటి అని నిలదీస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఒప్పుకోవాలని కూడా అంటున్నారు.
అంతే కాదు బొత్స సార్ కొన్ని ప్రశ్నలను కూడా వదిలారు. మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అని మాస్టర్లకు మండేలా చేశారు. పిల్లల తల్లిదండ్రులు ఎవరూ అభ్యంతరం పెట్టడం లేదని కూడా ఆయన అంటున్నారు. దీని వెనక కుట్ర ఉందని, అడ్డుకోవాలని చూస్తున్నారని బొత్స చాలానే మాట్లాడారు. విద్యా రంగంలో సంస్కరణలు తాము చేపడుతున్నామని, వాటి ఫలితాలు రావడానికి టైమ్ పడుతుంది అని ఆయన చెబుతున్నారు.
ఇక సీబీఎస్ఈ సిలబస్ తో పాటు, ఆంగ్ల మాధ్యమంలో బోధన, డిజిటల్ క్లాస్ రూమ్‌లు ఇలా వేర్వేరు అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. ఇవన్నీ సంస్కరణలే కదా అని అంటున్నారు. మరో వైపు ఉపాధ్యాయుల సమస్యల మీద తాము ఆలోచిన్స్తున్నామని కొసమెరుపు మెరిపించారు. మొత్తానికి బొత్స అనేది ఏంటి అంటే బెత్తం మా దగ్గర ఉండాలి కానీ మీరు అదిలించడం ఏంటనే కదా అంటున్నారు. బొత్స ఇపుడు హెడ్ మాస్టార్. ఆయన చెప్పినట్లే అంతా జరగాలేమో. సో ఫాలో అవుతారా. లేక సర్కార్ కి పాఠాలు నేర్పిస్తారా టీచర్లు ఏం చేయబోతున్నారు. వెయిట్ అండ్ సీ.