Begin typing your search above and press return to search.

బొత్స‌తో కాబోయే రాష్ట్ర‌ప‌తి చ‌ర్చ‌లు వావ్ వావ్

By:  Tupaki Desk   |   4 March 2022 12:30 PM GMT
బొత్స‌తో కాబోయే రాష్ట్ర‌ప‌తి చ‌ర్చ‌లు వావ్ వావ్
X
మంత్రి బొత్స మ‌ళ్లీ వార్త‌ల్లో నిలిచారు.ఆయ‌న రాయ‌భారిగా ఉంటూ రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల వేళ గులాం న‌బీ ఆజాద్ (కాంగ్రెస్ సీనియ‌ర్ లీడ‌ర్)కు సాయం చేసేందుకు సిద్ధం అయ్యారు.త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోతున్న రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల‌కు సంబంధించి ఇప్ప‌టికే ఆజాద్ త‌న ప్ర‌య‌త్నాలు మొదలుపెట్టారు.మోడీ కూడా ఆయ‌న విష‌య‌మై సానుకూలంగా ఉన్నారు.ఈ త‌రుణంలో బొత్స అనూహ్యంగా సీన్లోకి ఎంట్రీ ఇచ్చి, ఢిల్లీ కేంద్రంగా చ‌క్రం తిప్పుతున్నారు.ఇప్ప‌టికే వైసీపీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ బీజేపీ ఏం చెబితే అది చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ మ‌ద్ద‌తుతో బ‌రిలోకి దిగే ఆజాద్ కు అన్ని విధాల సాయం చేయాల‌ని బొత్స కూడా ఉవ్విళ్లూరుతున్నారు.ఇందుకు జ‌గ‌న్ కూడా పూర్తి స‌మ్మ‌తి ఇస్తున్నారు.వాస్త‌వానికి ఎప్ప‌టి నుంచో బీజేపీ బీ టీం గా ఉంటూ వ‌స్తున్న అటు తెలంగాణ రాష్ట్ర స‌మితి కానీ ఇటు వైసీపీ కానీ ఏనాడూ మోడీని వ్య‌తిరేకించింది లేదు.ముఖ్యంగా లోక్ స‌భ‌లో కానీ రాజ్య స‌భ‌లో కానీ నల్ల చ‌ట్టాల‌ను ఏవీ వ్య‌తిరేకించ‌లేదు.ఇప్పుడంటే కేసీఆర్ గేర్ మార్చారు కానీ అప్ప‌ట్లో బీజేపీ ఏం చెబితే అది చేసేందుకు కేసీఆర్ సిద్ధంగానే ఉండేవారు.రాష్ట్ర ప‌తి ఎన్నిక‌ల్లో కూడా పైకి ఒక‌టి లోపల ఇంకొక‌టి వైసీపీ తో క‌లిసి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు అని తెలుస్తోంది.

ఇక టీడీపీకి ఉన్న‌దే అతి కొద్ది మంది క‌నుక బీజేపీకే మ‌ద్ద‌తు ఇవ్వ‌డం త‌ప్ప మ‌రో మిన‌హాయింపు లేదు.మ‌రో ప్ర‌త్యామ్నాయం కూడా లేదు. ముగ్గురు ఎంపీలు (లోక్ స‌భ‌లో ఉన్నారు) ఇద్ద‌రు రాజ్య‌స‌భ‌లో ఉన్నారు.ఈ ఐదుగురూ బాబు మాట కాద‌ని ఓటెయ్య‌రు.ఆ విధంగా టీడీపీ కూడా బీజేపీవైపు ఉంటుంది. మొత్తానికి వీటన్నింటికీ ఇంఛార్జ్ బొత్స అనే తేలిపోయింది.అందుక‌నే ఆయ‌న తెలివిగా రాజ్య స‌భ సీటు త‌న‌కు ఇవ్వాల‌ని కోరుతున్నారు.కానీ జ‌గ‌న్ అదొక పెద్ద ప్ర‌క్రియ క‌నుక ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయించి త‌రువాత మ‌ళ్లీ ఆ స్థానానికి ఉప ఎన్నిక నిర్వ‌హించి ఇన్ని త‌ల‌నొప్పులు అవ‌స‌ర‌మా అని బొత్స‌ను త‌గ్గ‌మ‌న్నారు. ఆ విధంగా బొత్స ఇప్పుడు ఆజాద్ కు ద‌గ్గ‌ర. బీజేపీకి ద‌గ్గ‌ర మ‌రియు టీడీపీకి కూడా ద‌గ్గ‌రే !