Begin typing your search above and press return to search.
వైసీపీ గూటికి టీడీపీ ఎంపీ..ఇదే ఆధారం
By: Tupaki Desk | 26 Feb 2019 4:41 AM GMTటీడీపీకి ఎంపీలు గుడ్ బై చెప్పే పరంపరలో మరో ఎంపీ కూడా చేరే అవకాశం కనిపిస్తోంది. ఇంకో ఎంపీ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీతో టచ్ లోకి రావడం సంచలనంగా మారింది. టీడీపీ ఎంపీ తోటనరసింహం వైసీపీ నేత బొత్ససత్యనారాయణ భేటీ జరిగినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. తోట స్వగ్రామం కిర్లంపూడి మండలంలోని వీరవరంలో ఇరువురు నేతలు భేటీ అయ్యారని తెలుస్తోంది. దాదాపు అరగంట పాటు చర్చలు జరిగినట్లు సమాచారం. ఈ ఇద్దరూ నేతల భేటీతో ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకోవడం ఖాయమంటున్నారు. కాకినాడకు చెందిన టీడీపీ నేత - ఎంపీ తోట నరసింహంతో వైసీపీ నేత బొత్స సత్యనారాయణ భేటీ అవడం తెలుగుదేశం పార్టీకి షాక్ వంటిదేనని పేర్కొంటున్నారు.
కిర్లంపూడి మండలంలోని తోట నరసింహం స్వగ్రామం వీరవరం వెళ్లిన బొత్స ఆయనతో దాదాపు అరగంట పాటు చర్చలు జరిపినట్టు సమాచారం. భేటీ అనంతరం - బొత్స అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, తోటను బొత్స కలవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇప్పటికే టీడీపీ ఎంపీలు అవంతి శ్రీనివాస్ - పి.రవీంద్రబాబు తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఇదే దారిలో నరసింహం కూడా నడవనున్నారా? అనే చర్చ జరుగుతోంది. కాగా,ఈ పరిణామంపై తెలుగుదేశం పార్టీ స్పందించాల్సి ఉంది.
తాజా ఎపిసోడ్ పై రాజకీయ విశ్లేషకుల సమాచారం ప్రకారం - వైసీపీ అధినేత వైఎస్ జగన్ లండన్ టూర్ తర్వాత ఎంపీ తోట నరసింహం చేరికపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు. జగన్ తో బొత్స సమావేశమై తోట చేరిక ప్రతిపాదన గురించి చర్చిస్తారని - జగన్ నిర్ణయాన్ని బట్టి ఈ చేరిక ఉంటుందని పేర్కొంటున్నారు. ఒకట్రెండు రోజుల్లో ఈ మేరకు స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది.