Begin typing your search above and press return to search.

బొత్స బ్ర‌ద‌ర్ త‌గ్గిండులే!

By:  Tupaki Desk   |   19 Aug 2022 7:30 AM GMT
బొత్స బ్ర‌ద‌ర్ త‌గ్గిండులే!
X
రాష్ట్ర వ్యాప్తంగా ఈ హాజ‌రు విధానంపై ఉపాధ్యాయుల్లో ఆందోళ‌న రేగుతోంది. పాఠాలు చెప్ప‌డం మానుకుని టీచ‌ర్లంతా యాప్ లో త‌మ ఫేస్ రిక‌గ్నిష‌న్ కు మాత్ర‌మే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, అస‌లు విధులు ప‌క్కన ప‌డేస్తున్నార‌న్న వాద‌న కూడా ఉంది. ఈ ద‌శ‌లో తాము ఏం చెప్పాల‌నుకున్నామో, ఏం చేయాల‌నుకున్నామో అదే చేస్తామ‌ని మంత్రి బొత్స అంటున్నారు. అయితే కొన్ని మార్పులు, కొన్ని స‌వ‌ర‌ణ‌లు మాత్రం త‌ప్ప‌వ‌ని వాటిని కూడా సాధ్యాసాధ్యాల‌కు అనుగుణంగా అమ‌లు చేస్తామ‌ని బొత్స అంటున్నారు.

ఆ విధంగా పాఠ‌శాల‌ల‌కు వ‌చ్చే ఉపాధ్యాయుల‌కు మొబైల్స్ లేక‌పోయినా స‌రే, లేదా వారు తీసుకు రాక‌పోయినా స‌రే ఇత‌రుల మొబైల్ నుంచి హాజరు వేయ‌వ‌చ్చ‌ని, ఆఫ్ లైన్ లో కూడా హాజరు వేయ‌వచ్చ‌ని బొత్స ఎట్ట‌కేల‌కు స్పందించి, వివ‌ర‌ణ ఇచ్చి సంబంధిత త‌గాదాల‌కు ముగింపు ఇచ్చే ప్ర‌య‌త్నం ఒక‌టి చేశారు.

ఇవే విష‌యాల‌ను ఇవాళ ప్ర‌ధాన మీడియా ధ్రువీక‌రిస్తోంది. కానీ ఇన్ని జ‌రిగినా మాస్టార్లు మాత్రం వెన‌కకు త‌గ్గ‌డం లేదు. కొన్ని సంఘాలు ఆందోళ‌న‌ల‌కే సిద్ధం అవుతున్నాయి.

చాలా రోజుల‌కు మంత్రి బొత్స కాస్త త‌గ్గారు. ఆ విధంగానో ఏ విధంగానో కొంత ఊర‌ట. కానీ ఉపాధ్యాయులు మాత్రం తాము త‌గ్గేదే లే అని అంటున్నారు. ఇప్ప‌టికే ఫేస్ రిక‌గ్నిష‌న్ యాప్ ద్వారా ఉపాధ్యాయుల హాజరు శాతం న‌మోదు చేయాల‌ని ఏపీ స‌ర్కారు భావిస్తోంది. అందుకు అనుగుణంగానే జీత‌భ‌త్యాలు చెల్లించాల‌ని చూస్తోంది. కానీ ఈ ఒక్క విధానం ఇప్పుడు విద్యాశాఖ‌లోనే కాదు మిగ‌తా శాఖ‌ల్లోనూ తీసుకు రానున్నామ‌ని చెబుతున్నారు బొత్స.

అంటే ఇక‌పై అన్ని శాఖ‌ల‌కూ విధుల నిర్వ‌హ‌ణ అన్న‌ది క‌ఠిన‌త‌రం కానుంద‌ని చెప్ప‌క‌నే చెబుతున్నారు బొత్స. అయితే ఉపాధ్యాయులు విధుల‌కు హాజ‌ర‌య్యే క్ర‌మంలో నిమిషం ఆల‌స్యం అయితే ఆ రోజు పాఠశాల‌కు గైర్హాజ‌ర‌య్యారు అన్న విధంగా నిబంధ‌న‌ను రూపొందించారు. దీనిని మాత్రం యాప్ నుంచి తొల‌గిస్తామ‌ని బొత్స నిన్న‌టి వేళ చెబుతున్నారు.

అది త‌ప్ప మిగిలిన నిబంధ‌న‌లు అన్నీ త‌ప్ప‌క అమ‌లు అవుతాయ‌ని కూడా బొత్స చెబుతున్నారు. ఉపాధ్యాయ సంఘాల‌తో నిన్న‌టి వేళ బొత్స జ‌రిపిన చ‌ర్చ‌లు కూడా అసంపూర్ణంగానే మిగిలాయి అని తెలుస్తోంది. అంటే ఈ హాజ‌రు న‌మోదులో ఉన్న నిబంధ‌న‌లు అన్నీ అన్ని శాఖల‌కూ వ‌ర్తింప‌జేస్తామ‌ని చెప్ప‌డం మిన‌హా బొత్స సాధించింది ఏమీ లేద‌ని తేలిపోయింది.