Begin typing your search above and press return to search.
పవన్ కలలు కల్లలేనా.. బొత్స సార్ చెప్పిందేంటి... ?
By: Tupaki Desk | 24 Dec 2021 10:31 AM GMTపవన్ కళ్యాణ్ రాజకీయంగా రాణించాలనుకుంటున్నారు. ఆయన సినీ జీవితంలో పవర్ స్టార్ అనిపించుకున్నారు. సూపర్ స్టార్ డమ్ ని సొంతం చేసుకున్నారు. రాజకీయాలలో కూడా అత్యున్నత పీఠాన్ని అధిరోహించాలనుకుంటున్నారు. అందుకే పార్టీ పెట్టారు. ఏడేళ్లుగా జనసేనను నడిపిస్తున్నారు. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల కోసం పవన్ తనదైన శైలిలో ప్రిపేర్ అవుతున్నారు. ఆయన గత రాజకీయం ఎలా ఉన్నా ఈసారి మాత్రం పక్కా రొటీన్ పొలిటీషియన్ మాదిరిగానే ఆలోచిస్తున్నట్లుగా ఈ మధ్య కాలంలో ఆయన చేసిన కామెంట్స్ కనిపిస్తున్నాయి.
కాపులంతా ఒక్కటి కావాలని, వారి చుట్టూ మిగిలిన కులాలు అల్లుకోవాలని, ఈ విషయంలో కాపులు పెద్దన్న పోషించాలని రాజమండ్రీ వేదికగా పవన్ తన ఆంతరంగాన్ని ఆవిష్కరించారు. ఆ తరువాత కూడా ఆయన అదే విధంగా ఆలోచనలు చేస్తున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ జనసేన పెట్టినపుడు కంటే ఇపుడు రాజకీయంగా ఆరితేరారనే చెప్పాలి. వాస్తవ పరిస్థితులను అర్ధం చేసుకుని ప్రాక్టికల్ పొలిటీషియన్ గా తనను తాను మార్చుకునే ప్రయత్నంలో ఉన్నారు.
ఒక విధంగా ఏపీలో పాతిక శాతానికి పైగా ఓట్లతో మూడవ వంతు సీట్లను ప్రభావితం చేసే స్థాయిలో కాపులు ఉన్నారు. వారికి తాను పొలిటికల్ ఐకాన్ కావాలన్నది పవం మార్క్ పాలిటిక్స్ గా కనిపిస్తోంది. దానికి సినీ గ్లామర్ ని కూడా అద్దితే అందలం దక్కడం ఖాయమని ఆయన లెక్కలేవో ఆయనకు ఉన్నాయి. అయితే పవన్ కలలు ఏ విధంగానూ నెరవేరవు అని సీనియర్ మంత్రి వైసీపీ కీలక నేత బొత్స సత్యనారాయణ అంటున్నారు.
ఆయన ఒక యూట్యూబ్ కి ఈ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కాపు పాలిటిక్స్ మీద తన అభిప్రాయాలను కుండబద్ధలు కొట్టారు. తానే పెద్ద కాపు అని పవన్ ఎలా చెప్పుకుంటారని కూడా నిలదీశారు. పవన్ కాపులకు తాను ప్రతినిధిని కాదని గతంలో ఎన్నో సార్లు చెప్పుకున్నారని, తనకు కులాలు ఏవీ లేవని కూడా ఆయన అన్న మాటలను కూడా గుర్తు చేశారు.
ఇక కాపుల కోసం గట్టిగా పనిచేస్తూ వారిని బీసీలలో కలపాలని అతి పెద్ద ఉద్యమమే చేసిన ముద్రగడ పద్మనాభాన్ని గత ప్రభుత్వం నానా ఇబ్బందులు పెట్టిన వేళ పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారని కూడా ఆయన ప్రశ్నించారు. మన అవసరాల కోసం కాపులను దగ్గర చేసుకుందామంటే ఇపుడు కుదురుతుందా అని కూడా ఆయన అన్నారు. నాడు మెగాస్టార్ చిరంజీవి, దాసరి నారాయణరావు, తాను సహా అనేక మంది కాపు పెద్దలు ముద్రగడకు అండగా నిలిచిన సంగతిని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
ఇక కాపులు ఎవరి వైపు ఉన్నారన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ వారు ఎవరి వెంటా లేరని, తమ ఇంట్లోనే ఉన్నారని చెప్పుకొచ్చారు. కాపులకు ఎవరు మేలు చేస్తారో తెలుసని, వారినే ఎన్నుకుంటారు తప్ప కులాలను చూసి కాదని బొత్స పేర్కొన్నారు. అదే సమయంలో జగన్ తండ్రి వైఎస్సార్ మాదిరిగా పాలన చేస్తున్నారని, అందువల్లనే ఆయన్ని 2019 ఎన్నికల్లో ఎన్నుకున్నారని, పది కాలాల పాటు జగన్ పాలన కావాలనుకుంటున్నారని బొత్స పేర్కొన్నారు.
ఏపీలో రాజకీయాల్లో చూసుకుంటే కులాల కంటే కూడా ప్రజలు తమకు ఎవరు మంచి చేస్తారు అన్నది ఆలోచిస్తారని బొత్స చెప్పుకొచ్చారు. ఇక ఏపీలో జనసేన వైపు కాపులు ఉంటే గోదావరి జిల్లాల్లో ఈ మధ్య జరిగిన లోకల్ బాడీస్ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయింది అని ఆయన ప్రశ్నించారు. జనసేన, టీడీపీ, బీజేపీ కలసి వచ్చినా తమకు భయమేదీ లేదని, తాము ఆ విషయం అసలు ఆలోచించమని ఆయన అన్నారు. తాము బలంగా ఉండాలని ఎపుడూ కోరుకుంటాం తప్ప, ప్రత్యర్ధి బలహీనం కావాలని, ఆ విధంగా తాము పై చేయి సాధించాలని చూడమని, జగన్ రాజకీయ విధానం అది కానే కాదని బొత్స తేల్చేశారు.
ఇక బీజేపీ తమకు మిత్ర పక్షం కాదని, ఆ పార్టీ ఎవరితో పొత్తులు పెట్టుకుంటే తమకెందుకు ఆయన అన్నారు. అదే టైమ్ లో కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని, రాష్ట్రంలో వైసీపీ ఉందని, ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఎలా ఉండాలో అలాగే ఉంటామని, అంతకు మించి రాజకీయంగా బీజేపీతో ఎలాంటి సంబంధాలు ఉండవని బొత్స పక్కాగానే క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ కాపు కలలు కల్లలే అని తేల్చేసారు.