Begin typing your search above and press return to search.
అమరావతిపై లేటెస్ట్ గా బొత్స ఏం చెప్పారంటే?
By: Tupaki Desk | 25 Aug 2019 11:47 AM GMTఏపీ రాజధాని అమరావతిపై ఇటీవల ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారటమే కాదు.. అమరావతిలోని రియల్ ఎస్టేట్ మీద తీవ్ర ప్రభావాన్ని చూపాయి. తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన ఆయన.. తాజాగా మరోమారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన నోటి నుంచి అమరావతికి సంబంధించి వచ్చిన మాటలు చూస్తే.. చాలా క్లారిటీతో మాట్లాడినట్లుగా చెప్పక తప్పదు.
రాజధాని నిర్మాణంపై మొన్నటికి మొన్న ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శివరామకృష్ణ కమిటీ చేసిన సూచనల్ని నాటి టీడీపీ అధికారపక్షం లైట్ తీసుకుందని.. తాజాగా తాము మాత్రం ఆ అంశాల్ని పరిశీలిస్తున్నట్లుగా పేర్కొన్నారు. రాజధానిగా అమరావతిని మార్చకూడదంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. రాజధానిపై పవన్ వ్యాఖ్యలు డబుల్ మీనింగ్ వచ్చేలా ఉన్నాయని బొత్స వ్యాఖ్యానింరారు.
రాజధానికి వరద ముప్పు ఉందని స్పష్టం చేసిన బొత్స.. ఈ విషయాన్ని గత ప్రభుత్వానికి నిపుణుల కమిటీ చెప్పిందన్నవిషయాన్ని గుర్తు చేసిన బొత్స వ్యాఖ్యలు చూస్తే.. రాజధానిగా అమరావతిని ఫిక్స్ చేయటంపై జగన్ ప్రభుత్వం కొన్ని అంశాల్ని ప్రాతిపదికగా తీసుకొని పరిశీలిస్తున్న భావన కలుగక మానదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమరావతిలో రాజధాని నిర్మాణం భారం అవుతుందని చెప్పిన బొత్స మాటలు చూస్తే.. రానున్న రోజుల్లో ఏపీ రాజధాని నిర్మాణం విషయంలో జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకునే దిశగా అడుగులు వేస్తుందా? అన్న భావన కలుగక మానదు.